Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ కి బాకీ ఉన్నాడట!

By:  Tupaki Desk   |   17 Sep 2019 2:30 PM GMT
యంగ్ టైగర్ కి బాకీ ఉన్నాడట!
X
స్టార్ హీరో ఓ దర్శకుడు గతంలో చేసిన సినిమా చూసి అతన్ని నమ్మి ఛాన్స్ ఇస్తే ఆ దర్శకుడు ఆ హీరోకి ఓ ఫ్లాపు ఇచ్చిన సందర్భాలెన్నో. ఆ లిస్టులో తారక్ - హరీష్ శంకర్ కాంబినేషన్ ఒకటి. 'బాద్ షా' తో హిట్ అందుకున్న తర్వాత హరీష్ చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 'రామయ్య వస్తావయ్యా' సినిమా చేసాడు తారక్. అయితే ఆ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఘోరమైన అపజయం అందుకుంది.

కాంబినేషన్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కి వెళ్లిన తారక్ ఫ్యాన్స్ కూడా సినిమా చూసి నిరాశపడ్డారు. తారక్ డిజాస్టర్స్ లిస్టులో రామయ్య వస్తావయ్యా ముందు వరుసలో ఉండిపోయింది. అయితే ఆ డిజాస్టర్ సినిమాను లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో గుర్తుచేసుకొని తారక్ గురించి మాట్లాడాడు హరీష్ శంకర్.

'వాల్మీకి' ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉందని. అందులో తారక్ కూడా ఉన్నాడని. గతంలో ఆయన నన్ను నమ్మి సినిమా ఇస్తే అది అనుకున్నంత విజయం అందుకోలేదని ఆ విషయం తనని అప్పుడప్పుడు భాదిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక తారక్ కి ఓ హిట్ సినిమా బాకీ ఉన్నానని అన్నాడు. ప్రస్తుతానికైతే హరీష్ తో తారక్ సినిమా చేసే ఆలోచనలో లేడు. ఒక వేళ అన్ని కమిట్ మెంట్స్ పూర్తయ్యాక హరీష్ కి ఛాన్స్ ఇస్తే ఈ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక వేళ తారక్ అవకాశం ఇస్తే హరీష్ శంకర్ హిట్ ఇస్తాడనే నమ్మకం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి లేదు. అంతలా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసాడు హరీష్.