Begin typing your search above and press return to search.

మసాలా మాస్టర్ అనిపించుకున్నాడుగా!

By:  Tupaki Desk   |   22 Sep 2019 7:15 AM GMT
మసాలా మాస్టర్ అనిపించుకున్నాడుగా!
X
దబాంగ్ రీమేక్ ని పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ గా ప్రకటించినప్పుడు అందరికి అనుమానాలే. ఏదో సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్ ప్లస్ పండగ సీజన్ వల్ల బాగా ఆడిన ఆ సినిమా తెలుగులో వర్క ఔట్ అవుతుందాని దర్శకుడు హరీష్ శంకర్ నే టార్గెట్ చేశారందరూ. కట్ చేస్తే అది ఒరిజినల్ వెర్షన్ కంటే బాగా వచ్చి మాస్ కు గూస్ బంప్స్ ఇచ్చే అంశాలతో రూపొంది ఇతర బాషల దర్శకులు దీన్నే స్ఫూర్తిగా తీసుకుని రీమేకులు చేసుకునేంత భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది.

చాలా రిస్క్ తో కూడుకున్న ఇలాంటి రీమేక్ వ్యవహారంలో హరీష్ శంకర్ చేసిన మార్పుల విధానం అందరికి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా తమిళ జిగర్ తండా రీమేక్ ఎంచుకున్నప్పుడూ అదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. క్లాసిక్ గా నిలిచిన సినిమాను అనవసరంగా చెడగొడతారేమో అని అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ అంచనాలు మరోసారి తలకిందులయ్యాయి. వరుణ్ తేజ్ ఊర మాస్ గెటప్ లో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయిలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనే తేడా లేకుండా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి.

వీకెండ్ కాబట్టి అప్పుడే ఓ నిర్ధారణకు రాలేం కానీ పోటీ లేని దృష్ట్యా వీక్ డేస్ లో కూడా గద్దలకొండ గణేష్ దండయాత్ర కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఎండ్ క్రెడిట్స్ లోనూ నితిన్ తో పవన్ కళ్యాణ్ పేరు చెప్పించడం ఇవన్నీ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఎల్లువొచ్చి గోదారమ్మ పాట గురించి చెప్పనక్కర్లేదు. అనంతపూర్ లోని ఓ థియేటర్లో మొదటి రోజే ఈ పాటను రెండు సార్లు వరుసగా ప్లే చేశారంటే ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మాస్ పల్స్ పట్టుకోవడం అంటే ఇది