Begin typing your search above and press return to search.

దువ్వాడ టీమ్.. ఖైదీ సెట్లో ఏం పని?

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:07 AM GMT
దువ్వాడ టీమ్.. ఖైదీ సెట్లో ఏం పని?
X
మెగాస్టార్ నటిస్తున్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150. ఇప్పుడీ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగిపోతోంది. రీసెంట్ గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అవడంతో.. కీలకమైన సన్నివేశాల పిక్చరైజేషన్ పూర్తయిపోతోంది. ఈ టైమ్ లో అల్లు అర్జున్ కొత్త సినిమా టీమ్ మెగా150 సెట్స్ లో సందడి చేసింది.

అల్లు అర్జున్ కొత్త సినిమాకి దువ్వాడ జగన్నాథం అనే టైటిల్ ఫిక్స్ చేశారనే సంగతి తెలిసిందే. 'డీజే' అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో టైటిల్ లోగా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత దిల్ రాజులు.. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చింది. దువ్వాడ జగన్నాథం' టీమ్.. 'ఖైదీ నెం 150' లొకేషన్ కు వచ్చిందని కొణిదెల ప్రొడక్షన్స్ స్వయంగా ప్రకటించింది. ఇలా వచ్చిన వాళ్లు ఇటు చిరు తోను.. అటు హీరోయిన్ కాజల్ తోను.. మరోవైపు దర్శకుడు వినాయక్ తోనూ చాలాసేపే ముచ్చటించారు.

ఇంతకీ దిల్ రాజు అండ్ హరీశ్‌ శంకర్.. చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని సినిమా మొదలెట్టేస్తున్నారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కానీ.. ఇందులో ఉన్న ఇంకో మతలబు ఏంటంటే.. డీజేకి ఇంకా హీరోయిన్ కన్ఫాం కాలేదు. మరి హీరోయిన్ గా చేయమని కానీ.. ఐటెం సాంగ్ కోసం కానీ కాజల్ కి ఏదైనా ఆఫర్ ఇచ్చారా అనే టాక్ కూడా ఉంది లెండి.