డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ హరీష్!

Thu Sep 20 2018 13:36:15 GMT+0530 (IST)

దర్శకుడిగా షాక్ తో ప్రయాణం మొదలుపెట్టినా గబ్బర్ సింగ్ తో పరిశ్రమ దృష్టిని ఆకర్శించిన హరీష్ శంకర్ ఈ మధ్య అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. అల్లు అర్జున్ తో తీసిన డీజే కమర్షియల్ సక్సెస్ విషయంలో చాలా గందరగోళం సృష్టించిన నేపధ్యంలో ఆ టైంలో  బాగా ఎమోషనల్ అయ్యాడు కూడా. దాని ఫలితం తేలాక దాగుడుమూతలు పేరుతో ఒక మల్టీ స్టారర్ ఎంటర్ టైనర్ తీయబోతున్నట్టు హరీష్ శంకర్ పలు సందర్భాల్లో చెప్పాడు. దానికి నిర్మాతగా దిల్ రాజునే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ దిల్ రాజు తానీ దాగుడు మూతలు తీయలేనని తప్పుకున్నాడు.ఈ మాట ఆ మధ్య జరిగిన లవర్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో దిల్ రాజే స్వయంగా చెప్పాడు. సో కంటెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించాలి అనుకున్నాడేమో హరీష్ శంకర్ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడని టాక్. అది కూడా ఈ దాగుడు మూతల కోసమే.నిజానికి మొదటిసారి ఈ సబ్జెక్టు అనుకున్నప్పుడు హరీష్ శంకర్ నితిన్ శర్వానంద్ లను అనుకుని ఆ మేరకు కథను కూడా వినిపించాడట. కానీ తమకున్న కమిట్ మెంట్స్ పూర్తవ్వడనికి టైం పడుతుందని చెప్పడంతో ఈ లోపు వేరే పనుల్లో బిజీ అయిపోయాడు. హీరోయిన్లుగా నివేదా థామస్ రకుల్ ప్రీత్ సింగ్ లను ఓకే చేసారని కూడా టాక్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ హంబక్ అయిపోయాయి. హీరోలు మారి ఆ స్థానంలో సుధీర్ బాబు తో పాటు రామ్ వచ్చే అవకాశం గురించి చర్చ జరుగుతోంది. సుధీర్ కథ విన్నా హలో గురు ప్రేమ కోసమేలో బిజీగా ఉన్న రామ్ నుంచి ఇంకా సిగ్నల్ రాలేదని తెలిసింది. ఇది సెట్ అయ్యాక మిగిలిన టీమ్ ని డిసైడ్ చేస్తాడట హరీష్. ఏడాదిపైగా గ్యాప్ తో వేచి మరీ ఎదురు చూస్తున్నాడు అంటే దాగుడుమూతలు మీద హరీష్ కు గట్టి నమ్మకమే ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలో పూర్త వివరాలు తెలిసే అవకాశం ఉంది.