Begin typing your search above and press return to search.

చివరకు పవన్‌ ఒప్పుకున్నాడా??

By:  Tupaki Desk   |   24 May 2016 6:28 AM GMT
చివరకు పవన్‌ ఒప్పుకున్నాడా??
X

ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌ చాలా ప్రాజెక్టులను కన్ఫామ్‌ చేసినా కూడా.. వాటిలో పట్టాలెక్కుతోంది మాత్రం కేవలం ''హుషారు'' (వర్కింగ్ టైటిల్) సినిమా ఒక్కటే. ఎస్‌.జె.సూర్య డైరక్షన్‌ లో పవన్‌ చేయబోతున్న మూడో సినిమా అది. అయితే ఈ ప్రాజెక్టుతో పాటు పవన్‌ మరో సినిమాను కూడా పట్టాలెక్కించే ఛాన్సుందని ఒక టాక్‌ వినిపిస్తోంది.

సుబ్రమణ్యం ఫర్ సేల్‌ సినిమాకు మాంచి రెస్పాన్సే వచ్చినా కూడా.. ఎందుకో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇంతవరకు తన తదుపరి సినిమాను మొదలెట్టలేదు. అప్పట్లో మనోడు బన్నీతో ఒక సినిమా చేస్తాడని.. ఆ తరువాత సొంతంగా ఓ రెండు చిన్న సినిమాలు ప్రొడ్యూస్‌ చేస్తాడని టాక్‌ వచ్చింది కాని.. వాటిలో ఏదీ నోచుకోలేదు. ఇకపోతే ఇప్పుడు వినిపిస్తున్న టాక్‌ ఏంటంటే.. మనోడు పవన్‌ కళ్యాణ్‌ ను డైరక్టు చేయబోతున్నాడట.

ఎలాగో ఇప్పటికే గబ్బర్‌ సింగ్‌ తీసి శభాష్‌ అనిపించుకున్నాడు కాబట్టి.. ఇప్పుడు మరోసారి పవన్‌ డైరక్షన్‌ ఛాన్సు ఈజీగానే ఇస్తాడు. అయితే హరీశ్‌ మాత్రం తెలివిగా కథను ఏ.ఎమ్.రత్నంకు చెప్పాడట. ఆయన వెంటనే పవన్‌ కు ఫోన్‌ చేసి.. ఈ కథ చాలా బాగుంది మీరు కూడా వినండి అని చెప్పాడట. మరి పవన్‌ ఓకె చెప్పాడనే ప్రస్తుతానికి సన్నిహితులు చెబుతున్నారు కాని.. ఇంకా ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. లెటజ్ సీ.