Begin typing your search above and press return to search.

గ‌బ్బ‌ర్ సింగ్ 3 అంతా పుకారేనా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:28 AM GMT
గ‌బ్బ‌ర్ సింగ్ 3 అంతా పుకారేనా?
X
మిర‌ప‌కాయ్- గ‌బ్బ‌ర్ సింగ్ రోజులు ఇప్పుడున్నాయా? అంటే టాలీవుడ్ లో ఆ స‌న్నివేశం ఇప్పుడు లేనేలేద‌ని చెప్పాలి. అప్ప‌ట్లో మాస్ కంటెంట్.. రొటీన్ స్క్రీన్ ప్లేలు ఉన్నా వ‌ర్క‌వుట‌య్యేది కానీ ఈరోజుల్లో జ‌నం అలా సినిమాలు చూడ‌టం లేదు. ఏదైనా కొత్త‌గా యూనిక్ గా ఉండాల‌ని కోరుకుంటున్నారు. దాంతో పాటే స్క్రీన్ ప్లే ప‌రంగా గ్రిప్ లేనిదే ఆ మొత్తం ఎనాలిసిస్ ని టీవీ చానెళ్ల‌ లైవ్ లోనే చెప్పేస్తూ తాట తీస్తున్నారు. మేధోత‌నంతో కూడుకున్న ఆడియెన్ రివ్యూ రైట‌ర్ల కంటే స్పీడ్ గా ఉన్నారు. హ‌రీష్ శంక‌ర్ నో లేక‌పోతే టాలీవుడ్ లో ఉన్న డ‌జ‌ను మంది ద‌ర్శ‌కులు ఏ బ్రాండ్ సినిమాలు తీస్తారో ర‌చ‌యిత‌ల కంటే ఆడియెనే ఎక్కువ విశ్లేషిస్తున్నారు. మొన్నటికి మొన్న `సాహో`కి టీవీల ముందు జ‌నం చెప్పిన రివ్యూలే ఇందుకు ఎగ్జాంపుల్.

ప్ర‌స్తుతం న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు కొత్త పంథా క‌థ‌ల‌తో ఆడియెన్ కి కొత్త ట్రీటిచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం వెన‌క కార‌ణ‌మిదే. ఈ పోటీలో హ‌రీష్ శంక‌ర్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌కు అస‌లైన స‌వాల్ ఎదుర‌వుతోంది. అత‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎన్టీఆర్- ప్ర‌భాస్ లాంటి స్టార్ల‌ను డైరెక్ట్ చేయాలంటే మునుప‌టిలా పాత క‌థ‌ల‌తో ప‌న‌య్యే ప‌రిస్థితి లేదు. పవన్ తో గబ్బర్ సింగ్ 3 ఉంటుందని పుకార్లు వచ్చాయి క‌దా? అని నిన్న `వాల్మీకి` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో హ‌రీష్ శంక‌ర్ ని ప్రశ్నిస్తే.. ``అలా జరగాలని మీరు కోరుకోండి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాను`` అని స‌రిపెట్టేశాడు.

ఇండస్ట్రీలో ఎవరికైనా రుణపడ్డారా? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌రంగా స్పందించారు హ‌రీష్‌. ``ఎన్టీఆర్ కి చాలా ఋణపడి ఉన్నాను. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎప్పటికైనా ఆయనతో మంచి హిట్ మూవీ తీసి రుణం తీర్చుకుంటాను`` అని అన్నారు. ప్రభాస్ తో ప్లాన్ చేయ‌లేదా? అని ప్ర‌శ్నిస్తే.. ప్రభాస్- మహేష్ లాంటి హీరోలతో సినిమా చేసే ఛాన్సొస్తే ఎవ‌రు కాదంటారు. ఫ్యాన్స్ అడుగుతుంటారు. కానీ బాహుబలి లాంటి సినిమా తీయాలని మనం అనుకుంటే జరగదు.. దానంతటికదే అదే జ‌ర‌గాల్సి ఉంటుంది`` అంటూ కాస్త నిర్వేదంగానే ఆన్స‌ర్ చేశారు హ‌రీష్‌. మొత్తానికి టాలీవుడ్ లో మారిన సిట్యుయేష‌న్ ఎలా ఉందో హ‌రీష్ మాట‌ల్లో స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేయాలంటే పాన్ ఇండియా రేంజ్ స్క్రిప్టు తేవాల్సిన స‌న్నివేశం నెల‌కొంది. ప్ర‌భాస్- చిరంజీవి- ఎన్టీఆర్- చ‌ర‌ణ్ ఇప్ప‌టికే పాన్ ఇండియా బేసిస్ సినిమాల్లో న‌టిస్తుండ‌డంతో ఇత‌ర హీరోలు ఆ దిశ‌గానే ఆలోచిస్తున్నారు. అందువ‌ల్ల ఇదో త‌ర‌హా కొత్త ఛాలెంజ్ అనే చెప్పాలి.