ఫ్లాపు బాబులు బాలయ్యను పడేస్తున్నారు

Tue Sep 12 2017 05:00:01 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. అసలు 100వ సినిమాను చేయకముందు ఆయన తన తదుపరి సినిమాను ఎంచుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఎట్టకేలకు క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చేశారు. అయితే ఆ తరువాత అన్నీ అలాంటి విభిన్న సినిమాలనే ఎంచుకుంటారు అనుకుంటే.. ఇప్పుడు మాత్రం అన్నీ ఊరమాస్ కమర్షియల్ సినిమాలను చేస్తున్నారు.నిజానికి బాలయ్య ఊరమాస్ సినిమాలను చేద్దాం అనుకోవడం.. చాలామంది దర్శకులకు తెగ కలసివస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్ నే తీసుకోండి. ఆయన ఒక రొటీన్ కతకు 'ఆటోజాని' అని టైటిల్ పెట్టేసి మెగాస్టార్ చిరుకు చెబితే.. ఆయన రిజక్ట్ చేశారు. సినిమాలోని ఆటో డ్రైవర్ పాత్రను అడ్డదిడ్డంగా మార్చేసి దాన్నే పైసా వసూల్ అంటూ బాలయ్య తీశాడని ఇప్పుడు టాక్. ఈ సినిమా తీయకముందు కూడా పూరి ఫ్లాపులే తీశాడు. ఇక దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కూడా ఈ మధ్యన అన్నీ ఫ్లాపులే తీశాడు. ఇప్పుడు మాత్రం బాలయ్యతో 102వ సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ యావరేజ్ సినిమాలకు పరిమితం అయిపోయిన హరీశ్ శంకర్ కూడా.. ఇప్పుడు బాలయ్యకే కథ చెబుతున్నాడట. చూస్తుంటే ఫ్లాపులు తీస్తున్న దర్శకబాబులందరూ.. ఇలా బాలయ్యను భలే వలలో పడేస్తున్నారని అనిపించట్లేదూ?

ఏదేమైనా దర్శకులకు ఇలా బాలయ్య ఛాన్సులు ఇవ్వడం కూడా ఆయన గొప్పతనం అనే చెప్పాలి. అయితే ఆ ఛాన్సులను దర్శకుడు సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం.. అది వారి బ్యాడ్ లక్ అనాల్సిందే.