Begin typing your search above and press return to search.

మ‌హేష్ -ముర‌గ‌దాస్ సినిమాకి హ్యారీష్ మ్యూజిక్‌!

By:  Tupaki Desk   |   28 Nov 2015 1:30 AM GMT
మ‌హేష్ -ముర‌గ‌దాస్ సినిమాకి హ్యారీష్ మ్యూజిక్‌!
X
గ‌తంలో మ‌హేష్ హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సైనికుడు చిత్రానికి హ్యారీష్ జ‌య‌రాజ్ సంగీతం స‌మ‌కూర్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం పెద్ద‌గా ఆడ‌క‌పోయినా పాట‌ల ప‌రంగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ -ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న చిత్రానికి హ్యారీష్ జ‌య‌రాజ్ మ్యూజిక్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేశారు కాబట్టి మ‌హేష్ కూడా ఓకే చేసినట్టు స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా ముర‌గదాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రాల‌కు సంగీతం హ్యారీష్ అందించాడు. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా మ్యూజిక‌ల్ హిట్సే అని చెప్పాలి. కాబట్టి ఈ విధంగా కూడా మ‌హేష్ ఆలోచించి హ్యారీష్ మ్యూజ‌క్ డైర‌క్ట‌ర్గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్ కెమెరామెన్‌ గా వ్వ‌వ‌హిస్తున్నాడంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. దీన్ని బ‌ట్టి చూస్తుంటే మ‌హేష్ త‌దుప‌రి సినిమా హై టెక్నిక‌ల్ వాల్యూస్‌ తో భారీ రూపొంద‌నుంద‌ని తెలుస్తోంది.

న్యాయ వ్య‌వ‌స్థ పై హీరో చేసే పోరాట‌మే ఈ చిత్ర‌మ‌ని ఇటీవ‌ల వార్త‌లు వస్తున్నాయి. ఇందులో ఉన్న సోష‌ల్ ఎలిమెంట్స్ న‌చ్చి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడట మ‌హేష్‌. మ‌హేష్ చేస్తున్న సినిమాలు, సెల‌క్ట్ చేసుకుంటున్న డైర‌క్ట‌ర్స్ ని బ‌ట్టి మ‌హేష్ మంచి ప్లానింగ్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడంటున్నారు సినీ ప‌రిశీల‌కులు.