Begin typing your search above and press return to search.

పిల్ల జమీందార్ పిల్ల దూకుడు పెంచింది

By:  Tupaki Desk   |   13 Feb 2016 3:30 PM GMT
పిల్ల జమీందార్ పిల్ల దూకుడు పెంచింది
X
డిమాండ్ ఉన్నపుడు ఓ రకంగా.. లేనపుడు మరోరకంగా ఉండడం, మాట్లాడ్డం హీరోయిన్లకు కొత్తేం కాదు. కాస్త చేతిలో నాలుగు అవకాశాలు ఉన్న టైంలో.. ఏదన్నా గ్లామర్ చూపించమంటే తెగ బెట్టు చేసేస్తారు. తర్వాత ఆఫర్లు లేని టైంలో.. అడిగినంత చూపిస్తాం అంటూ ఆఫర్ ఇచ్చి.. చెప్పినదాని కంటే ఎక్కువగా గ్లామర్ ధారపోసేస్తూ ఉంటారు.

ఈ కోవకు చెందిన హీరోయిన్స్ చాలామందే ఉంటారు కానీ.. ఇప్పుడు మనం చెప్పుకునేది నాని సరసన పిల్ల జమీందార్ లో కనిపించిన భామ హరిప్రియ గురించి. అప్పట్లో తకిట తకిట లాంటి సినిమాలు చేసినపుడు.. గ్లామర్ అంటే.. ఉఊ అనేసింది. కన్నడలో నాలుగు అవకాశాలు వెతుక్కుని వెళ్లిపోయింది. అక్కడ కూడా ఛాన్సులు మెల్లగా తగ్గిపోవడం ఇప్పుడో కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి యాక్సెప్ట్ చేసింది. అదే నీర్ డోస్. ఈ చిత్రంలో అమ్మడి కేరక్టర్ బాగా బోల్డ్. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి... హరి ప్రియను ఫుల్ డ్రస్ లో చూడనేలేదు జనాలు.

సిగరెట్లు - మందు.. బికినీలు - టూపీస్ లు.. స్మిమ్మింగ్ పూల్స్ - పార్టీలు ఇలా అందాల ప్రదర్శన కు ఉన్న అన్ని ప్లేసుల్లోనూ హరిప్రియ కనిపించేసింది. ఇక రీసెంట్ గా అయితే.. స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో లిక్కర్ గ్లాసుతో రెచ్చగొడుతోంది. అయితే.. ఈ నీర్ డోస్ పై మాత్రం శాండల్ వుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.