రష్మీని తీసేసి ఆమెను పెడుతున్నారా?

Wed Oct 11 2017 14:30:34 GMT+0530 (IST)

టైం ఎప్పుడు ఎలా కలిసొస్తుందో చెప్పడం కష్టం. అదృష్టం అనే లెక్కలు అక్కడే వస్తాయి మరి. కొన్నేళ్లుగా సినిమాల్లో చిన్నాచితకా పాత్రలలో నటిస్తున్న హరితేజకు.. అఆ మూవీతో త్రివిక్రమ్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ కార్యక్రమంతో ఈమె సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు హరితేజకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఇటు  సినిమాల్లో భారీ సంఖ్యలోనే ఛాన్సులు వస్తున్నాయి.. మరోవైపు టీవీ రంగం నుంచి కూడా పిలుపులు అందుతున్నాయి.అయితే.. రెండు నెలలకు పైగా సయమాన్ని కుటుంబానికి దూరంగా గడపడంతో.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న హరితేజ కొత్త ఛాన్సులు అంగీకరించే విషయంలో చాలా అలర్ట్ గా ఉంటోంది. కానీ.. ఓ ఆఫర్ మాత్రం ఈమెను బాగా టెంప్ట్ చేసిందట. టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించాల్సిందిగా ఈమెకు ఆఫర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అది కూడా రష్మీని రీప్లేస్ చేసి ఈమెను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో మల్లెమాల టీం ఉన్నారట. బిగ్ బాస్ కార్యక్రమంలో ఈమె చూపించిన చలాకీతనం అందరినీ ఆకట్టుకోగా.. కామెడీ విషయంలోనూ.. తెలుగులో దంచికొట్టడంలోనూ ఈమె సూపర్.

అందుకే రష్మీ ప్లేస్ ను హరితేజతో రీప్లేస్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై అఫీషియల్ న్యూస్ అయితే ఏం లేదు కానీ.. కొన్నేళ్లుగా జబర్దస్త్ హోస్ట్ చేస్తున్న రష్మికి హరితేజ దెబ్బ గట్టిగానే తగలనుందని అంటున్నారు. మరికొన్ని టీవీ షోలకు కూడా హోస్ట్ చేయాలని ఈమెను అడుగుతున్నారట. బుల్లితెరపై కూడా హరితేజకు బోలెడంత భవిష్యత్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ రూమర్లలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.