Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరూ మరో రియాలిటీ షోలో..

By:  Tupaki Desk   |   24 Sep 2017 3:30 PM GMT
వాళ్లిద్దరూ మరో రియాలిటీ షోలో..
X
స్టార్ మా ఛానల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా టెలికాస్ట్ చేసిన తొలి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. విన్నర్ అనౌన్స్ మెంట్ తో సీజన్ -1 ముగుస్తుంది. ఈ షో ద్వారా ఇంతవరకు పెద్దగా లైమ్ లైట్ లో లేని చాలామందికి మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఫైనల్స్ దాకా వచ్చిన ఆదర్శ్ అండ్ హరితేజలకు ఇంతకుముందు సినిమాల్లో చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో వల్లనే వచ్చింది.

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు వచ్చిన వీరిద్దరినీ మరో రియాలిటీ షోలో చూపించాలని స్టార్ మా భావిస్తోందనేది లేటెస్ట్ న్యూస్. ఈ ఛానల్ త్వరలో స్టార్ట్ చేయబోతున్న నీతోనే డ్యాన్స్ పేరిట టెలికాస్ట్ చేస్తున్న షోలో వీరిద్దరి పార్టిసిపేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తెలుగు ఛానళ్లలో డ్యాన్స్ షోలు కొత్తేం కాకపోయినప్పటికీ స్టార్ మా నీతోనే షోను కాస్త కొత్తగా డిజైన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తొలిసారి టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈమెతోపాటు జానీ మాస్టర్ - హార్ట్ అటాక్ ఫేం హీరోయిన్ అదాశర్మ జడ్జిలుగా ఉండబోతున్నారు. ఉదయభాను ఈ ప్రోగాంను హోస్ట్ చేయబోతోంది.

ఈ ప్రోగ్రాంలో హరితేజ అండ్ ఆదర్శ్ వారి జంటలతో అటెండ్ కానున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షోలో హరితేజ తన భర్తతో... ఆదర్శ్ తన భార్యతో ఒకసారి ప్రేక్షకులను పలకరించారు. మరోసారి మరో రియాలిటీ షోలో తమ భాగస్వాములతో కలిసి ప్రేక్షకులను ఎంటర్ టెయిన్ చేయబోతున్నారు. చూడబోతే బిగ్ బాస్ వీరి కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చేలా కనిపిస్తోంది.