Begin typing your search above and press return to search.

పదేళ్ల నుంచి పదిలంగా దాచింది.. ముదురే!!

By:  Tupaki Desk   |   29 Sep 2016 3:30 AM GMT
పదేళ్ల నుంచి పదిలంగా దాచింది.. ముదురే!!
X
హన్సిక ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన రవితేజ పవర్ తర్వాత.. ఇప్పటివరకూ టాలీవుడ్ సినిమాకే సైన్ చేయలేదీ పాతికేళ్ల సోయగం. మధ్యలో సైజ్ జీరోల మెరిసింది కానీ.. అది కేవలం కేమియో అపియరెన్స్ మాత్రమే. అయితే.. త్వరలోనే హీరోయిన్ గా పదేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్న ఈ భామ.. స్పెషల్ ఫోటోషూట్స్ తో అలరిస్తోంది.

రీసెంట్ టైమ్ లో పదేళ్ల పాటు టాప్ హీరోయిన్ (తమిళంలో మాత్రమే) అనే రేంజ్ ని కంటిన్యూ చేయగలిగిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. పైగా అప్పుడెలా ఉందో.. ఇప్పటికీ అంతే అందాన్ని మెయింటెయిన్ చేయగలగడం హన్సిక స్పెషాలిటీ. ఇందుకు ఈమె ఏజ్ ని చెప్పుకోవాలి లెండి. ప్రస్తుతం హన్సిక వయసు ఓ 26 ఉంటుందంతే. అంటే.. 2007లో ఈమె హీరోయిన్ అయ్యేపాటికి.. ఓ పదహారేళ్ల పడుచు అంతే.

2007 సంక్రాంతికి విడుదలైన దేశముదురుతో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా అప్ గ్రేడ్ అయిన ఈ బ్యూటీ.. మరో మూడు నెలల్లో పది వసంతాల పండుగ జరుపుకోనుంది. దశాబ్ద కాలంగా తన అందాలను ఇంకా కొత్తగా కనిపించేలా దాచుకోగలిగిందంటే.. హన్సిక నిజంగా దేశముదురే!