Begin typing your search above and press return to search.

హన్సిక ఇలాంటి కేరక్టర్లు కూడా చేస్తుందా?

By:  Tupaki Desk   |   2 May 2016 4:28 AM GMT
హన్సిక ఇలాంటి కేరక్టర్లు కూడా చేస్తుందా?
X
హన్సిక మొత్వాని చేసిన పాత్రల్లో చాలావరకూ గ్లామర్ రోల్స్ అనేందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. అరణ్మణై మినహాయిస్తే.. ఈ దేశముదురు భామకు పెర్ఫామెన్స్ తో సంబంధం ఉన్న రోల్స్ పెద్దగా పడలేదు. తను కూడా ఈ జోనర్ నే బాగా కంఫర్ట్ గా ఫీల్ అయింది. ఇప్పుడు మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేస్తూ వరుసగా ట్యాలెంట్ చూపించే రోల్స్ లో నటిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది హన్సిక.

ఉదయనిధి స్టాలిన్ కి జంటగా మణితన్ అనే మూవీలో నటించింది హన్సిక. మణితన్ రిలీజ్ ఇవాళే కావడంతో.. ప్రమోషన్స్ లో తెగ బిజిగా ఉన్న ఈ బొద్దు భామ.. బోలెడన్ని సంగతులు చెప్పుకొస్తోంది. 'సాధారణంగా నేను గ్లామర్ రోల్స్ లోనే కనిపిస్తాను. కానీ ఈ సినిమాలో పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేశాను. నా కెరీర్ లో ఇది గుర్తుంచుకోదగ్గ సినిమా. ప్రియ అనే టీచర్ పాత్రలో.. కాటన్ చుడీదార్లలనోనే కనిపిస్తాను. హెయిర్ - మేకప్ కూడా విభిన్నంగా ఉంటాయి' అని చెబ్తోంది హన్సిక.

మణితన్ తర్వాత బోగాన్ మూవీలో జయం రవికి జంటగా నటిస్తోంది హన్సిక. ఈ హీరోతో మూడో సారి నటిస్తుండడంతో.. ఇప్పటికే రోమియో - జూలియట్ జంట మళ్లీ కలుస్తున్నారోచ్ అనే టాక్ మొదలైంది. ఈ పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ఉండడంతో పాటు.. ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని చెబ్తోంది.