Begin typing your search above and press return to search.

సాహ‌సం చేసిన హ‌న్సిక!

By:  Tupaki Desk   |   24 Nov 2015 3:29 PM GMT
సాహ‌సం చేసిన హ‌న్సిక!
X
చెన్న‌య్ రోడ్డు మీద న‌టి హ‌న్సిక హ‌ల్‌ చ‌ల్ చేసింద‌ట‌. త‌ను ప్ర‌యాణిస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకోవ‌డంతో కారు దిగి త‌ను ఉంటున్న హోట‌ల్ వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్లింద‌ట‌. ఆమె ఎందుకు న‌డ‌వాల్సి వ‌చ్చిందే క‌దా మీ సందేహం. అక్క‌డికే వ‌స్తున్నా. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా త‌మిళ‌నాడు న‌గ‌ర వాసులు చాలా ఇబ్బందులకు గుర‌వుతున్న‌ది తెలిసిందే. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం కావ‌డంతో న‌గ‌ర‌వాసులు ప‌డ‌వ ప్ర‌యాణం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌ట‌. చెన్నైలో ఉన్న పరిస్థితి హన్సికకు తెలుసు. కానీ, మ‌రీ ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఆమె ఊహించ‌లేద‌ట‌. ఎందుకంటే కొన్ని రోజులుగా తను ముంబయ్ లో ఉంది. ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి తను చెన్నయ్ చేరుకుంది.

చెన్నయ్ ఎయిర్ పోర్ట్ లో విమానం దిగి, బయటకు వచ్చి హన్సిక కారు ఎక్కింది. జస్ట్ కాసేపట్లో హోటల్ కి చేరుకుని, రిలాక్స్ కావొచ్చని అనుకుంది. కానీ, రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓపికగా కారులో కూర్చున్న హన్సికకు చివరికి ఓపిక నశించింది. కారు దిగి, హోటల్ వరకూ నడుచుకుంటూ వెళ్లిపోయింది. గిండీలోని లీ రాయల్ మెరీడియన్ హోటల్ నుంచి వేలచేరిలో ఉన్న పార్క్ హయత్ హోటల్ వరకూ హన్సిక నడుచుకుంటూ వెళ్లిందట. హన్సికను గుర్తుపట్టి అభిమానులు చుట్టముట్టారట‌. ఆమెను ఎవ‌రూ ఇబ్బంది ఎటువంటి ఇబ్బందీ పెట్ట‌కుండా ఆమె వెళ్ల‌డానికి స‌హ‌కరించార‌ట‌. నిజంగా ఇలా న‌డిచి వెళ్లి సాహ‌సం చేసింద‌నే చెప్పాలి.