Begin typing your search above and press return to search.

సుచీ లీక్స్ పై హన్సిక స్పందించింది

By:  Tupaki Desk   |   25 March 2017 11:06 AM GMT
సుచీ లీక్స్ పై హన్సిక స్పందించింది
X
సుచీ లీక్స్.. మూడు వారాల కిందట ప్రకంపనలు రేపిన టాపిక్. తమిళ సింగర్ కమ్ రేడియో జాకీ సుచిత్ర పేరుతో ట్విట్టర్లో బయటికి వచ్చిన తమిళ నటీనటుల ఫొటోలు.. వీడియోలు సంచలనం రేపాయి. ఆ కోవలో మరిన్ని చీకటి బాగోతాల్ని బయటపెడతానంటూ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి ఫీలర్లు వచ్చాయి. సుచిత్ర హెచ్చరించిన వాళ్లలో హన్సిక పేరు కూడా ఉంది. దీనిపై ఆమెతో పాటు ఎవ్వరూ స్పందించలేదు. సైలెంటుగా ఉండిపోయారు. ఆ వివాదం కూడా సద్దుమణిగింది. ఇప్పుడు హన్సిక దీనిపై మాట్లాడింది. ‘‘ముందు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తెలియాలి. అప్పుడే దాని గురించి ఏదైనా మాట్లాడగలం. ఎవరి పేరుతో అయితే ఆ విషయాలన్నీ బయటికి వచ్చాయో ఆ వ్యక్తితో నాకు స్నేహమూ లేదు. అలాగే శత్రుత్వమూ లేదు’’ అని హన్సిక ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఈ ఇంటర్వ్యూలో శింబుతో ప్రేమాయణం గురించి కూడా హన్సిక స్పందించింది. శింబు అన్న ఒక్క మాట వల్ల హర్టయి అతడికి గుడ్ బై చెప్పేసినట్లు హన్సిక వెల్లడించింది. ‘‘మాది మంచి జంట అవుతుందనుకున్నా. ఒకరికొకరం పర్ఫెక్ట్ అనుకున్నా. కానీ అతను నన్ను హర్ట్ చేశాడు. అప్పటికి నాకు సరైన మెచ్యూరిటీ లేదు. అతడికి ఒక్క మాటలో నా ఉద్దేశం చెప్పేసి ముందుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఐతే ఏం జరిగినా నా మంచికే అనుకుంటున్నా’’ అని హన్సిక అంది. ఇక కెరీర్ కొంత కాలంగా డల్లుగా నడుస్తుండటంపై హన్సిక మాట్లాడుతూ.. ‘‘కావాలనే కొంచెం గ్యాప్ తీసుకున్నా. నాతో నేను గడపాలనుకుంటున్నా. ఐతే తెలుగులో కొన్ని మంచి సినిమాలు మిస్సయ్యాను. తమిళంలో బిజీగా ఉండటం వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశాలు వదులుకున్నా. దీంతో తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. ఐతే టాలీవుడ్ ను నా మదర్ ఇండస్ట్రీ లాగా భావిస్తాను’’ అని హన్సిక తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/