ఎన్టీఆర్ కు బ్యూటీల క్యూ!

Mon Nov 26 2018 14:22:53 GMT+0530 (IST)

బహుశా బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక హీరోయిన్లు ఒకే సినిమాలో నటించిన ఆరుదైన రికార్డు ఎన్టీఆర్ బయోపిక్ కు దక్కేలా ఉంది. దర్శకుడు క్రిష్ ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఫామ్ లో ఉన్న మరియు లేని క్రేజీ హీరోయిన్లందరిని ఇందులో కథానాయికల క్యామియోల కోసం ఏరికోరి వెతికి తెస్తున్నాడు. నిన్న జయసుధ పాత్ర కోసం పాయల్ రాజపుత్ కన్ఫర్మ్ అయ్యిందన్న న్యూస్ ఇంకా చర్చలో ఉండగానే ఇప్పుడు మరో అప్ డేట్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంది. జయప్రద పాత్ర కోసం యాపిల్ బ్యూటీ హన్సికను ఓకే చేసినట్టు సమాచారం. టెస్ట్ షూట్ కూడా విజయవంతం కావడంతో క్రిష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది.జయప్రద అంటే నందమూరి అభిమానుల జ్ఞాపకాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. దానికి కారణం అడవి రాముడు సినిమా. టాలీవుడ్ షోలేగా మాస్ సినిమాకు డిక్షనరీగా భావించే అడవి రాముడులో జయప్రద ఎన్టీఆర్ ల జోడి అప్పట్లో సెన్సేషన్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటకు ప్రేక్షకులు తెరపైకి డబ్బులు విసిరేవారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో.

ఈ ఇద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అగ్ర నిర్మాత అశ్వినీదత్ మొదటి మూవీ యుగపురుషుడులో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది జయప్రదే. ఇలా చాలా రకాలుగా ప్రత్యేకత ఉన్న జయప్రద పాత్ర కు హన్సిక మంచి ఛాయస్ అనే చెప్పొచ్చు. మొత్తానికి ముద్దుగుమ్మల క్యామియోలతో సూపర్ హిట్ సాంగ్స్ కి నాన్న ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చేయబోయే అల్లరి గురించి ఫ్యాన్స్ అప్పుడే ఊహాగానాల్లో తేలిపోతున్నారు