Begin typing your search above and press return to search.

నేను డబ్బులిచ్చాను అంటున్న యాపిల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 March 2018 10:11 AM GMT
నేను డబ్బులిచ్చాను అంటున్న యాపిల్ బ్యూటీ
X
ఇటీవలే తన బకాయి తీర్చకుండా ఎగ్గొట్టారని హీరొయిన్ హన్సిక మొత్వానిపై ఆమె మాజీ మేనేజర్ మునిస్వామి మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న హన్సిక దీని వల్ల తన ఇమేజ్ కి జరుగుతున్న డ్యామేజ్ గుర్తించి రంగంలోకి దిగేసింది. అసలు అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదని, తనకు ఇవ్వాల్సిన డ్యూస్ అన్ని క్లియర్ చేసానని చెబుతోంది. మునిస్వామి చెప్పిన ప్రకారం హన్సిక అక్షరాల కోటి రూపాయల దాకా చెల్లించాలట. ఒక మేనేజర్ కి ఇంత పెద్ద మొత్తంలో బాకీ అంటే చిన్న విషయం కాదు. కాని ఇది ఈ మధ్య జరిగిన విషయం కాదట. కొన్నేళ్ళ క్రితమే హన్సిక వరస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు పర్సెంటేజ్ మీద మునిస్వామికి జీతం ఇస్తానని ఒప్పందం చేసుకున్న హన్సిక ఆ తర్వాత మాట మార్చేసిందని కోలీవుడ్ టాక్.

ప్రస్తుతం హన్సిక వ్యవహారాలు ఆమె తల్లి చూసుకుంటున్నారు. మునిస్వామి తన వద్ద చాలా కాలం పని చేసాడని, ఒకవేళ ఎగొట్టే మనస్తత్వమే తనకు ఉంటే ఇన్నాళ్ళు ఎలా పని చేస్తాడని రివర్స్ లో ప్రశ్నిస్తోంది. హన్సిక కెరీర్ ప్రస్తుతం కాస్త డల్ గానే ఉంది. ఓ ఐదేళ్ళు తమిళ్ లో ఉధృతమైన కెరీర్ ని ఎంజాయ్ చేసిన హన్సిక అక్కడ అభిమానులతో గుడి కట్టించుకునే రేంజ్ కు చేరుకుంది. తెలుగులో గత ఏడాది గోపీచంద్ గౌతం నందా,మంచు విష్ణు లక్కున్నోడులో కనిపించింది కాని రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తమిళ్ లో తుపాక్కి మున్నై అనే సినిమా షూటింగ్ లో ఉన్న హన్సిక కొత్త సినిమా గులేబకావళి తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ నెల 23న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని ప్రమోషన్ కోసం మీడియాకు విస్తృతంగా అందుబాటులో ఉన్న టైంలోనే మునిస్వామి ఎపిసోడ్ బయటికి రావడం హన్సికకు తలనెప్పిగా మారింది.

మునిస్వామి కథలో మరో ట్విస్ట్ ఏంటంటే అతని వద్ద పక్కా ఆధారాలు కూడా ఉన్నాయట. హన్సిక రాజీ చేసుకోకపోతే అవి బయట పెడతాను అంటున్నాడు. గతంలో హీరొయిన్ త్రిష కూడా తన మేనేజర్ విషయంలో ఇలాంటి చిన్న పాటి వివాదంలో చిక్కుకుంటే అది త్వరగానే పరిష్కారమయ్యింది. మరి హన్సిక మునిస్వామిల గొడవ ఎక్కడ ఆగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కోలీవుడ్ వర్గాలు