హన్సిక బుగ్గ గిల్లారా?

Mon Apr 16 2018 16:49:12 GMT+0530 (IST)

తెల్ల పిల్ల హన్సికకి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడి అభిమానులు ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టేశారంటే... హన్సిక అంటే తమిళ తంబీలకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. అభినయం పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా అజంతా శిల్పంలా ఉండే అందంతో తెరమీద నెట్టుకొస్తోంది హన్సిక. అయితే ఈ అమ్మడికి తాజాగా ఆమె అభిమానుల నుంచే ఓ చిలిపి అనుభవం ఎదురైందట.చెన్నైలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లింది హన్సికా మోత్వానీ. తన అభిమాన తారని చూసేందుకు అక్కడికి చాలామంది జనం వచ్చేశారు.  అంత మందిని దాటుకుని ఆమె షాప్ వద్దకి చేరుకోవడం కష్టమైపోయింది. వెంట భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ వారు కంట్రోల్ చేయలేనంత మంది ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎలాగోలా జనాల్ని తోసుకుంటూ హన్సిక కారు దగ్గరికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే కొద్ది దూరం వెళ్లాక ఆమె చెంపల మీద చేతులు అడ్డు పెట్టుకుని కనిపించింది. ఎవరైనా ఆమె చెంపని తాకడానికి... గిల్లడానికి ప్రయత్నించి ఉంటాడని... అందుకే ఈ దేశముదురు పిల్ల భయంతో చేతులు అడ్డం పెట్టుకుని ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎవరూ తాకలేదని జనాల గోల చేస్తుండడంతో చెవులకు అడ్డంగా చేతులు పెట్టుకుందేమో... అనుకునే వాళ్లూ ఉన్నారు. దీనికి హన్సిక ఇంకా స్పందించలేదు. ఆమె మాట్లాడితే గానీ అసలు విషయం తెలీదు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే గులేబాకావళి సినిమాతో సంక్రాంతి హిట్టుకొట్టిన హన్సిక ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి