Begin typing your search above and press return to search.

ముదురు భామకు ఒక్క హిట్ ఇవ్వండయ్యా

By:  Tupaki Desk   |   23 Jun 2017 1:15 PM GMT
ముదురు భామకు ఒక్క హిట్ ఇవ్వండయ్యా
X
ముదురు అంటే ఇక్కడ రొటీన్ అర్ధం కాదు లెండి.. దేశ ముదురు మూవీతో హీరోయిన్ గా పరిచయమైన హన్సికా మొత్వాని గురించి ఇప్పుడు చెప్పేసుకుందాం. చైల్డ్ యాక్ట్రెస్ గా అనుభవం ఉన్న ఈమె.. అల్లు అర్జున్ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినా.. తెలుగులో పెద్దగా వెలగలేకపోయింది.

కానీ అదే సమయంలో తమిళ్ లో మంచి సినిమాలు పడ్డంతో.. అక్కడ స్టార్ స్టేటస్ సంపాదించేసుకుంది. కళావతి సిరీస్ లో లీడ్ కేరక్టర్లో నటించేసి హిట్స్ కూడా కొట్టేసింది. ఇంత చేసినా ఈమెను హీరోయిన్ చేసిన తెలుగులో మాత్రం హన్సికకు హిట్టు పడ్డం లేదు. అసలు సినిమా ఆఫర్లే అరకొరగా వస్తున్నాయి. లక్కున్నోడు అంటూ మంచు విష్ణుతో నటించినా.. దానికి ఈమె హీరోయిన్ నటించిన తెలుగు సినిమా రవితేజ పవర్. ఇప్పుడు గోపీచంద్ మూవీ గౌతమ్ నందతో మరోసారి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించునేందుకు వస్తోంది.

స్ఫూర్తి అనే పాత్రలో కనిపించనున్న హన్సిక.. బాగా సాంప్రదాయంగా కనిపిస్తున్న లుక్ ని రివీల్ చేశారు. అయితే.. ఇది సంపత్ నంది దర్శకత్వంలో రూపొందతున్న మూవీ అనే విషయం గుర్తు చేసుకుంటే.. హీరోయిన్స్ మరీ ఇంత క్లాస్ గా ఉండరనే విషయం అర్ధమయిపోతుందిలే. మరి సంపత్ నంది.. గోపీచంద్ కలిసి ఈమెకు ఓ హిట్ కట్టబెడతారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/