Begin typing your search above and press return to search.

యురోప్ హాలిడేలో యాపిల్ బ్యూటి

By:  Tupaki Desk   |   26 July 2017 8:08 AM GMT
యురోప్ హాలిడేలో యాపిల్ బ్యూటి
X
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో సౌత్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన యాపిల్ పై బ్యూటి హన్సిక ఇప్పుడు పూర్తిగా తమిళ్ హీరోయిన్ అయిపోయింది. ఇక్కడ కంత్రి, మస్కా లాంటి సినిమాలు చేసినా పెద్ద పేరు రాలేదు కాని తమిళ్ సినిమాకు వెళ్ళి అక్కడ తన ముద్దు బొద్దు రూపంతో ఒక మాదిరి కమర్షియల్ హీరోయిన్ అయిపోయింది. బాల నటిగా మొదలుపెట్టిన హన్సిక కెరియర్ ఇప్పుడు తమిళ్ సినిమాకు దొరికిన నవ కుష్బూగా చెలామణి అవుతోంది.

వరుస సినిమా షూటింగ్లతో కొంచం విసిగి పోయింది ఏమో ఈ చిన్నది ఇప్పుడు తన స్నేహితులు తో విహారానికి వెళ్లింది. తూర్పు యురోప్ లో ఉన్న క్రొయేషియా సముద్ర తీరంలో ఇలా ఇప్పుడు సేద తీరుతుంది. అక్కడ నుండి చాలా ఫోటోలో కూడా షేర్ చేస్తోంది. బ్ల్యూ జీన్స్ వేసుకొని చిన్న వైట్ టాప్ స్పోర్ట్స్ బ్రా వేసుకొని ముద్దులు ఒలికిపోస్తుంది హన్సిక. అక్కడ తన ఫ్రెండ్స్ తో అమ్మడు బ్యాక్ ప్యాక్ ట్రిప్ వేస్తోందట. ఇక్కడంటే అమ్మడిని అలా చూడగానే జనాలు ఎగబడిపోయి నానా రచ్చ చేస్తుంటారు కాని.. అక్కడ మాత్రం ఎవరు పట్టించుకుంటారులే అనుకుందేమో.. తన సోయగాలతో అలా ప్రకృతిని ఆస్వాదిస్తోంది.

హన్సిక నటించిన సినిమాలన్నీ విడుదల కావడానికి లైన్లో ఉన్నాయి. ఒక తమిళ్ సినిమా ఒక మలయాళం సినిమా మరో తెలుగు సినిమా గోపి చంద్ హీరోగా నటిస్తున్న గౌతమ్ నంద సినిమా ఒకటి విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సొగసరి బాగనే హిట్లు ఇచ్చిన ఎందుకో ఎవరు ఇంకా స్టార్ హీరోయిన్ లా గుర్తించటం లేదు. మరి గౌతమ్ నంద వంటి సినిమాల ప్రమోషన్లకు సరిగా రాకపోతే ఎవరు గుర్తిస్తారు చెప్పండి.