Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ఒక టైం బాంబ్

By:  Tupaki Desk   |   24 Aug 2017 12:30 AM GMT
ఆ హీరోయిన్ ఒక టైం బాంబ్
X
తాకితే కందిపోయేలా ఉండే ముద్దుగుమ్మ హ‌న్సిక‌. టీనేజ్‌ లోనే వెండితెర మీద త‌న అందంతో యూత్‌ ను మెస్మ‌రైజ్ చేసేసిన ఈ బొద్దుగుమ్మ తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింద‌ని చెప్పాలి. టాలీవుడ్ లో పేరు ప్ర‌ఖ్యాతుల‌కు కొద‌వ‌లేకున్నా.. తెలుగు కంటే త‌మిళం మీద‌నే హ‌న్సిక‌కు ఎక్కువ ఫోక‌స్ అని చెబుతారు. అయితే.. ఈ విష‌యాన్ని ఆమె కొట్టి పారే్స్తున్నారు.

ఇదిలా ఉంటే.. హ‌న్సిక‌కు కోలీవుడ్ లో టైంబాంబ్ అన్న పేరు ఉంద‌ట‌. అయితే.. ఎలాంటి డేంజ‌ర్ లేని టైంబాంబ్‌ గా ఆమెను అభివ‌ర్ణిస్తున్నారు. ఇంత‌కీ ఆమెకు ఆ ఇమేజ్ ఎందుక‌న్న విష‌యానికి వ‌స్తే.. షూటింగ్‌ కు టైం అంటే టైంకు వ‌చ్చే వారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇక‌.. అగ్ర‌శ్రేణి న‌టుల విష‌యంలో కాస్త అటూఇటూగా ఉండేవారే ఎక్కువ‌. టైమ్‌ సెన్స్ పాటించేవారు త‌క్కువ‌. కానీ.. హ‌న్సిక మాత్రం అందుకు భిన్న‌మ‌ట‌.

షూటింగ్‌ కు ఫ‌లానా టైం అంటే.. ఆ స‌మ‌యానికి ప‌ది నిమిషాల ముందే సెట్‌ కు వ‌చ్చేయ‌టం హ‌న్సిక‌కు అల‌వాటు. ఆమెకున్న టైమ్ సెన్స్ తో ఆమెను టైంబాంబ్‌ గా అభివ‌ర్ణిస్తున్నారు. తాజాగా త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా తాను ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల మ‌ధ్య తాను చేసుకున్న బ‌ర్త్ డే వేడుక‌ల్ని ఆమె సోష‌ల్ మీడియాతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేశారు.

కోలీవుడ్ మీద చూపించే ప్రేమాభిమానాలు టాలీవుడ్ మీద చూపించ‌టం లేద‌న్న దానిపై ఎలాంటి నిజం లేద‌ని.. త‌న‌కూ రెండు వుడ్ లు రెండు క‌ళ్లు లాంటివంటూ చెప్పుకొచ్చారు. కోలీవుడ్‌ లో ఒప్పుకున్న సినిమాల‌తో టాలీవుడ్‌ లో డేట్లు ఇవ్వ‌టం కుద‌టం లేదే త‌ప్పించి.. మ‌రింకేమీ లేద‌ని.. టాలీవుడ్‌ ను నిర్ల‌క్ష్యం చేయ‌టం లేద‌ని ఆమె చెప్పారు. టాలీవుడ్‌ లో త‌న‌కు త‌గ్గిన అవ‌కాశాల గురించి హ‌న్సిక భ‌లే క‌వ‌ర్ చేసింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.