పిక్స్ లీక్: అప్పుడు అక్షర..ఇప్పుడు హన్సిక

Tue Jan 22 2019 21:59:04 GMT+0530 (IST)

పన్నెండేళ్ళ క్రితం అల్లు అర్జున్ 'దేశముదురు' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. అప్పట్లో తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించిన హన్సిక తర్వాత మాత్రం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.  ప్రస్తుతం హన్సిక తన 50 వ సినిమా 'మహా' లో నటిస్తోంది.  ఈ సినిమా ప్రమోషనల్ పోస్టర్లు ఈమధ్య వివాదాస్పదం కావడం తెలిసిందే.  ఇదిలా ఉంటే తాజాగా హన్సిక మరో విషయంలో హాట్ టాపిక్ అయింది.హన్సిక ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉంది.  అక్కడ మియామీలో ఫుల్ గా చిల్ అవుట్ అవుతోంది. కాకపోతే అక్కడ ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన తన బికినీ ఫోటోలు.. ఇతర ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం సంచలనం సృష్టిస్తున్నాయి.  బికినీ ఫోటోలే హాటుగా ఉన్నాయి అనుకుంటే.. హన్సిక స్వయంగా తీసుకున్నట్టు అనిపించే సెల్ఫీలు మరింత ఘాటుగా ఉన్నాయి. దీంతో  హన్సిక ఫోన్ హ్యాకింగ్ అయి ఉండవచ్చని..అందుకే ఆ ఫోటోలు లీకయ్యి ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు మాత్రం హన్సిక ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యే దశలో ఉంది కాబట్టి క్రేజ్ కోసం ఇలా చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఈ ఫోటో లీక్ వ్యవహారంలో హన్సిక ఇంతవరకూ స్పందించలేదు. కొంతకాలం క్రితం కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ లీకై సోషల్ మీడియాలోకి వచ్చిన సంగతి తెలిసిందే.  అప్పట్లో ఆ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పుడు హన్సిక వంతు.  మరి ఈ వ్యహరంపై హన్సిక ఏమంటుందో వేచి చూడాలి.