Begin typing your search above and press return to search.

దేశముదురు భామకు ఆ ఏజ్ రాలేదంట

By:  Tupaki Desk   |   27 Oct 2016 10:30 PM GMT
దేశముదురు భామకు ఆ ఏజ్ రాలేదంట
X
హన్సికా మొత్వానీ.. టాలీవుడ్ లో ఈ భామ పేరు పదేళ్లుగా వింటూనే ఉన్నాం. 2007లో పూరీ తీసిన దేశముదురు మూవీతో స్టైలిష్ స్టార్ తో జోడీ కట్టి.. హీరోయిన్ గా అరంగేట్రం చేసిందీ భామ. అంతకు ముందు కూడా సినిమాలు చేసినా అవి చైల్డ్ ఆర్టిస్ట్ కేరక్టర్లే. ఆల్రెడీ అనుభవం ఉండడంతో.. యాక్టింగ్ లో ఇరగదీసేసి టాప్ హీరోయిన్ స్లాట్ పట్టేసింది. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ కాలేకపోయినా.. తమిళ్ పై ఫుల్లుగా కాన్సంట్రేట్ చేసి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇప్పుడు హన్సిక ఏజ్ 25 సంవత్సరాలు. హీరోయిన్స్ ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం అరుదు కానీ.. అమ్మడితోపాటు ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు ఇప్పటికే లైఫ్ లో సెటిల్ అయిపోయారు. మరికొందరు ఆ ట్రయల్స్ లో ఉన్నారు. టీనేజ్ మధ్యలోనే హీరోయిన్ అయిపోయిన హన్సిక.. పదేళ్ల అనుభవం సంపాదించినా.. ఇంకా 25 ఏళ్ల వయసు దగ్గరే ఉంది. మరి పెళ్లి ఆలోచనలు ఉన్నాయా అంటే.. 'నేనింకా చిన్నపిల్లనే. పెళ్లీడు రాలేదు. ఇంకో ఐదేళ్లాగి పెళ్లి చేసుకుంటా అంటూ' దేశముదురు పలుకులు పలుకుతోంది హన్సిక.

కానీ.. ఈ భామకు లవ్ లో మాత్రం ఎక్స్ పీరియన్స్ ఉంది. ప్రేమ అనేది అందమైన అనుభవం అని.. తన లైఫ్ లో అది వచ్చి వెళ్లిపోయిందని చెప్పిన హన్సిక.. అమ్మ చూసిన కుర్రాడినే బుద్ధిగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/