Begin typing your search above and press return to search.

హారికా హాసిని లో అస‌లేం జ‌రుగుతోంది..

By:  Tupaki Desk   |   22 May 2019 8:02 AM GMT
హారికా హాసిని లో అస‌లేం జ‌రుగుతోంది..
X
స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ అండ‌దండ‌ల‌తో హారికా హాసిని బ్యాన‌ర్ వారు పెద్ద‌గా క‌మ‌ర్షీయ‌ల్ స‌క్సెలు లేక‌పోయినా ఏదోలా నెట్టుకొచ్చేస్తున్నారు. కేవ‌లం త్రివిక్ర‌మ్ కార‌ణంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ - బ‌న్నీ - జూనియ‌ర్ య‌న్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఈ బ్యాన‌ర్ లో సినిమాలు చేశారు, చేస్తున్నార‌న్న‌‌ది ఇండ‌స్ట్రీ టాక్ - ఇదే ఫార్మూల‌తో ప్ర‌స్తుతం బ‌న్నీ కూడా హారికా హాసిని సినిమాలో త‌న మూడో సినిమా చేసేందుకు సైన్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన జులాయ్ - స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి. క‌మ‌ర్షీయ‌ల్ గా అనుకున్నంత రేంజ్ లో ఈ రెండు సినిమాలు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయాయి, కానీ త్రివిక్ర‌మ్ మీద బ‌న్నీకి ఉన్న కాన్ఫీడెన్స్ తో ముచ్చట‌గా మూడో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.

అయితే తాజాగా ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న కామెంట్స్ ప్రకారం ఈ సినిమాను హారికా హాసినిలో నిర్మించ‌డం బ‌న్నీకి ఏ మాత్రం ఇష్టం లేదట‌ - అయితే త్రివిక్ర‌మ్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో ప్రొడ‌క్ష‌న్ మొత్తం గీత ఆర్ట్స్ బ్యాన‌ర్ కు సంబంధించిన సిబ్బందితో ఆధ్వర్యంలోనే న‌డ‌వాల‌ని బ‌న్నీ ఓ ష‌ర‌తు పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అల్లు అరవింద్ కూడా ఈ సినిమాలో మ‌రో నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బ‌న్నీ ఈ నిర్ణ‌యానికి రావ‌డం గ‌తంలో హారికా హాసిని వారు బ‌డ్జెట్ - ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో చేసిన పొర‌పాట్లే అస‌లు కార‌ణం అని అంటున్నారు. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే - త్రివిక్ర‌మ్ ను మొత్తం బౌండ్ స్ర్రీప్ట్ తో రావాల్సిందిగా బ‌న్నీ సూచించాడ‌ట‌, త్రివిక్ర‌మ్ కూడా ఇందుకు ఒప్పుకొని కొంత టైమ్ తీసుకొని మొత్తం క‌థ రెడీ చేసి షూట్ స్టార్ట్ చేశాడని తెలిసింది. అయితే ఇలా స్ర్కీప్ట్ విష‌యంలో త్రివిక్ర‌మ్ టైమ్ తీసుకోవ‌డం పై హారికా హాసిని వారు కాస్త అస‌హానానికి లోనైయ్యార‌ని తెలిసింది. ఎందుకంటే గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో మొద‌లు కావాల్సిన ఈ ప్రాజెక్ట్ తాజాగా ప‌ట్టాలెక్క‌డం హారికా హాసిని వారిని కాస్త ఆర్ధికంగా ఇబ్బందు‌లకు గురి చేసింద‌ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అపోహ‌ల్లో ఎంత వ‌రుకు నిజం ఉందో తెలియ‌దు కానీ - బ‌న్నీ మాత్రం ఈసారి త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. ఇలాగైనా హారికా హాసిని వారిని చిర‌కాలంగా ఊరిస్తున్న క‌మ‌ర్షీయ‌ల్ స‌క్సెస్ అందుతుందేమో చూడాలి.