హైపర్ ఆది ప్రపోజ్ చేశాడుగా!!

Wed Feb 14 2018 23:00:41 GMT+0530 (IST)

సినిమాల్లో నటిస్తేనే ఈ రోజుల్లో స్టార్స్ అయిపోవడం లేదు. వారి టాలెంట్ ను ఏ విధంగా బయటపెట్టుకున్నా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రియాలిటీ షోలలో కామెడీ చేస్తూ.. ఈ మధ్య ఎంతో మంది బుల్లి తెరపైనే సూపర్ స్టార్స్ గా ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో హైపర్ అది ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆది ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పాపులారిటీని బాగా సంపాదించుకుంటున్నాడు.సినిమాల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలను కూడా అందుకుంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మనోడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూన్నట్లు కనిపించాడు. అయితే ఆ ఫొటో ఈ రోజుది అనుకుంటే పొరపాటే. ఆది తొలిప్రేమ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఫారిన్ లో షూటింగ్ జరిగినపుడు అక్కడ ఓ అమ్మాయితో కలిసి లవర్ బాయ్ లా స్టిల్ ఇచ్చాడు.

ఇక ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ..అందరికి హ్యపీ వాలెంటైన్స్ డే.. స్ప్రెడ్ లవ్ అంటూ మెసేజ్ ఇచ్చాడు ఆది. దీంతో ఫాలోవర్స్ ఆ ఫొటోపై చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఆధికి పంచులతో పాటు ప్రపోజ్ చేయడం కూడా వచ్చే..అని ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు.