ఆ నిర్మాత ఎంజెలినాను కూడా వదల్లేదట

Wed Oct 11 2017 14:18:33 GMT+0530 (IST)

ప్రముఖ నిర్మాత ఎంతటి కామపిశాచి అన్న విషయం ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఇప్పటికే పలుమార్లు అతడిపై ఆరోపణలు వెల్లువెత్తి ఇబ్బంది పడుతున్న అతడికి.. తాజాగా బయటకు వచ్చిన సంచలన అంశాలతో ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ.. ఎవరా ప్రముఖ హాలీవుడ్ నిర్మాత అంటే హార్వే వెయిన్ స్టన్.అమెరికా విపక్షమైన డెమోక్రాట్లకు భారీ విరాళాలు ప్రకటించే అతడి తీరుపై ఒక మేగిజిన్ ఆధారాలతో సహా బయటపెట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెయిన్ స్టన్ చేతిలో లైంగికంగా వేధింపులకు గురైన వారుగా ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే.. తాజాగా అతగాడిపై వచ్చిన ఆరోపణ ఏమిటంటే.. ప్రముఖ హాలీవుడ్ నటీమణులు ఏంజెలినా జోలి.. గైనెత్ పాల్ట్రోలను కూడా ఈ కామపిశాచి వదల్లేదని సదరు మేగిజిన్ వెల్లడించింది.

తన సినీ కెరీర్ ఆరంభంలో తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని.. తన లైంగిక వాంఛల్ని తీర్చాలంటూ వేధించేవాడని ఏంజెలీనా.. గైనెత్ లు వెల్లడించటంతో అతగాడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లైంది.

ఇంతకాలం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. వాటిని ఖండించేవారు లేకపోలేదు. తాజాగా మాత్రం అతగాడి దరిద్రపు పనుల్ని ఆధారాలతో సహా బయటపెట్టటం.. ఆగ్రశ్రేణి నటీమణులు కూడా అతగాడి బాధితురాళ్లుగా ఉండటం పెను సంచలనంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ నిర్మాత మీద వచ్చిన ఆరోపణలు అమెరికా విపక్షమైన డెమొక్రాట్లకు పెద్ద తలనొప్పిగా మారింది. తమకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే వ్యక్తి మీద నీచమైన ఆరోపణలు రావటంతో.. ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

మరో కీలకమైన అంశం ఏమిటంటే.. మాజీ అమెరికా అధ్యక్షడు ఒబామా కుమార్తె మాలియా కూడా ప్రస్తుతం అతడి దగ్గరే ఇంటర్న్ షిప్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో ఇతగాడి లైంగిక వాంఛకు పలువురు బలైనట్లుగా ప్రముఖ టైమ్స్ మ్యాగజీన్ వెల్లడించింది. తాజాగా మాత్రం.. ఏంజెలీనా లాంటి అగ్రనటి నుంచి కూడా ఆరోపణలు ఎదురుకావటంతో హార్వే వెయిన్ స్టన్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు.