Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కామెడీ + యాక్షన్ = గుంటూరోడు

By:  Tupaki Desk   |   11 Jan 2017 10:59 AM GMT
ట్రైలర్ టాక్: కామెడీ + యాక్షన్ = గుంటూరోడు
X
సినిమాల్లో మాస్ సినిమాలు వేరయా.. వాటిని సరైన హీరో చేస్తే వచ్చే కిక్కే వేరయా అని చెప్పాల్సిందే. అందుకే ఎప్పటికీ ఎక్స్ పైరీ డేట్ అనేదే లేని జోనర్ ఊరమాస్. అదే ట్రాక్ లో గుంటూరోడు అంటూ వచ్చేస్తున్నాడు మంచు మనోజ్. లవ్ లో పడ్డాడు అనే ట్యాగ్ లైన్ దీనికి సెపరేట్ అట్రాక్షన్ కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మొదట టీజర్ లో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ ని చూపించగా.. తాజా ట్రైలర్ లో లవ్ ట్రాక్.. దానితో పాటు మిక్స్ చేసిన కామెడీ డోస్ ను కూడా గుంటూరోడు చూపించాడు. కామెడీ టైమింగ్ లో తను ఎంత పర్ఫెక్ట్ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మనోజ్. 'ప్రయత్నిస్తే పోయేది ఏముందండి.. బ్యాచిలర్ బానిస శృంఖలాలు తప్ప' అంటూ ప్రగ్యాతో చేసిన కామెడీ బాగానే పండింది. అప్పటివరకూ కామెడీగా నడిపిన ట్రైలర్ ను విలన్ ఇంట్రడక్షన్ ను యాంగిల్ మార్చేశారు.

'మొగుడినైనా మేనేజ్ చేయచ్చు కానీ.. రంకుమొగుడిని మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా' అంటూ కోటతో చెప్పించిన డైలాగ్.. 'సత్తా ఉన్నోడిని చూస్తే చావుకు కూడా పడిపోద్ది నా కొ..కా' అంటూ మనోజ్ పేల్చే పవర్ ఫుల్ పంచ్.. 'ఈడు మరీ తీటగాడిలా ఉన్నాడు.. భయం భక్తీ ఎక్కడా మచ్చుకు కూడా కనబడట్లా' అంటూ ట్రైలర్ చివర్లో వినిపించే డైలాగ్.. గుంటూరోడు ఎంత ఊర మాస్ గా ఉంటాడో చెబుతున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి మంచు ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు మనోజ్.