నాగార్జునతో ఢీ అంటున్న మంచు పిల్లోడు

Thu Jan 12 2017 09:58:01 GMT+0530 (IST)

పోటుగాడు కరెంటు తీగ సినిమాలతో రెండేళ్ల కిందట మాంచి ఊపులో కనిపించాడు మంచు మనోజ్. కానీ గత ఏడాది శౌర్య ఎటాక్ సినిమాలు అతణ్ని గట్టి దెబ్బ కొట్టాయి. పైపైకి ఎగురుతున్నవాడు దబేల్‌మని కింద పడ్డాడు. కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించి ఫెయిలవడంతో ఈసారి తనదైన స్టయిల్లో ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు మనోజ్. ఆ చిత్రమే.. గుంటూరోడు. ఆ మధ్య రిలీజైన ‘గుంటూరోడు’ టీజర్.. లేటెస్టుగా లాంచ్ చేసిన ట్రైలర్ చూస్తే ఇది మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలాగే కనిపిస్తోంది. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేసేయాలని చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘గుంటూరోడు’ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందట.'

విశేషం ఏంటంటే.. ఫిబ్రవరి 3న మంచు విష్ణు సినిమా ‘లక్కున్నోడు’ విడుదల కాబోతోంది. ఆ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ అయినప్పటికీ వారం వ్యవధిలో తమ్యుడి సినిమాను కూడా రిలీజ్ చేసేయాలని ఫిక్సయిపోయారు. వారం గ్యాప్‌లో వస్తే పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరి 10న అక్కినేని నాగార్జున సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఐతే అది ఆధ్యాత్మిక చిత్రం కావడం.. తమది మాస్ మసాలా సినిమా కావడంతో రెంటికీ పోటీ ఏమీ ఉండదని... దేని ఆడియన్స్ దానికి ఉంటారని ‘గుంటూరోడు’ టీమ్ అనుకుంటున్నట్లుంది. ఇంతకుముందు ‘నా రాకుమారుడు’ అనే సినిమా తీసిన ఎస్కే సత్య ‘గుంటూరోడు’కు దర్శకత్వం వహించాడు. ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/