Begin typing your search above and press return to search.

రానా సినిమాకు అంత బడ్జెట్టా?

By:  Tupaki Desk   |   21 Feb 2018 7:58 AM GMT
రానా సినిమాకు అంత బడ్జెట్టా?
X
దగ్గుబాటి రానా సోలో హీరోగా ఇంకా పెద్ద మార్కెట్ సంపాదించుకోలేదు. గత ఏడాది అతను కథానాయకుడిగా నటించిన ‘ఘాజీ’.. ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి ఫలితాలే అందుకున్నాయి. కమర్షియల్ సక్సెస్ సాధించాయి. ఐతే ఆ రెంటి మీదా బడ్జెట్ తక్కువే పెట్టారు. ‘ఘాజీ’ని మూడు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ కు వచ్చింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తెలుగులోనే పెట్టుబడిని వెనక్కి తెచ్చింది.

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించినప్పటికీ.. సోలో హీరోగా రానా మీద 30-40 కోట్ల బడ్జెట్ అన్నా కష్టమే అన్నట్లుంది పరిస్థితి. అలాంటిది సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రానా మీద రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు వస్తున్న వార్తలు విస్తుగొలుపుతున్నాయి. ‘రుద్రమదేవి’ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్.. ‘హిరణ్యకశిప’ సినిమా తీయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాను ఈ సినిమా చేయబోతున్నట్లు రానా కూడా ధ్రువీకరించాడు.

‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ మీద రూ.70 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి పెద్ద సాహసమే చేశాడు గుణ. ఆ సినిమా చాలా వరకు పెట్టుబడిని వెనక్కి తెచ్చి గుణశేఖర్ కష్టానికి మంచి ఫలితమే అందించింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రానా మీద రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతున్నాడట గుణ. ఈ చిత్రాన్ని ఉన్నంతమైన సాంకేతిక విలువలతో భారీగా తీర్చిదిద్దాలని.. పలు భాషల్లో దీన్ని రిలీజ్ చేయడం ద్వారా బడ్జెట్ రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాడట గుణ. కానీ ఏం చేసినా రానా మీద అంత బడ్జెట్ మీద వర్కవుట్ అవుతుందా అన్నది సందేహమే.