Begin typing your search above and press return to search.

నో డౌట్‌.. గుణశేఖర్ ట్రాక్‌ తప్పలేదు

By:  Tupaki Desk   |   31 May 2016 5:30 PM GMT
నో డౌట్‌.. గుణశేఖర్ ట్రాక్‌ తప్పలేదు
X
ఎంతో కష్టపడి ఏళ్లపాటు శ్రమించి రుద్రమదేవి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్. విడుదల విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కున్నా.. ఎట్టకేలకు మూవీని రిలీజ్ చేసి.. మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టగలిగాడు. రుద్రమదేవి మేకింగ్ లో గుణ చూపించిన ప్రతిభకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

అయితే రుద్రమదేవి ఎండ్ కార్డ్స్ లోనే.. జనాలు ఊహించని ఓ షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఈ మూవీకి కొనసాగింపుగా ప్రతాపరుద్రుడు కూడా ఉంటుందని చెప్పేశాడు. చెప్పినట్లుగానే ఆ మూవీకి సంబంధించి అనేక మంది స్టార్లతో చర్చలు కూడా జరిపాడు. ఇవేవీ వర్కవుట్ కాకపోవడంతో.. ఇక ప్రతాపరుద్రుడు ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లే అనే టాక్ వినిపించింది. ఓ 10 కోట్ల ఖర్చుతో చిన్న సినిమా ఏదో తీసుకుంటున్నాడనే రూమర్స్ కూడా మొదలైపోయాయి. ట్రాక్‌ మారిపోయాడు అంటూ సెటైర్లు కూడా వేశారు కొందరు. దీంతో గుణశేఖర్ హర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. తాను ప్రతాపరుద్రుడు సబ్జెక్ట్ కే కమిట్ అయ్యానని చెప్పాడు ఈ దర్శకుడు.

''ఆర్కైవ్స్ వెతుకుతున్నాం, చరిత్రకారులను కలుస్తున్నాం. ప్రస్తుతం ప్రతాపరుద్రుడు- ద లాస్ట్ ఎంపరర్ పరిశోధన పూర్తి స్థాయిలో జరగుతోంది- గుణ టీమ్ వర్క్స్'' అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు గుణ. మొత్తానికి ఈయన తాను పట్టుకున్న సబ్జెక్ట్ కే లింక్ అయ్యాడనే విషయం తేలిపోయింది. కానీ ఈ సబ్జెక్ట్ లీడ్ చేసే హీరో ఎవరన్నదానికే ఇంకా సమాధానం దొరకలేదు.