Begin typing your search above and press return to search.

దర్శకుడి కూతురు.. డైరెక్టర్ కానుందా?

By:  Tupaki Desk   |   25 March 2017 12:32 PM GMT
దర్శకుడి కూతురు.. డైరెక్టర్ కానుందా?
X
భారీ చిత్రాలు తీయడం.. భారీ భారీ సెట్టింగులు వేయడం లాంటి వాటికి.. ఈ తరంలో ఆద్యుడైన దర్శకుడు గుణ శేఖర్. తన ప్రతీ సినిమాలోనూ ఓ కాస్ట్లీ కం భారీ సెట్ తో ఆకట్టుకోవడం.. దాని చుట్టూ కథ నడిపించడం ఈయనకు అలవాటు. స్టార్ వారసులు కూడా స్టార్లుగా మారేందుకు ప్రయత్నించడం సహజం.

ఇప్పుడు గుణ శేఖర్ కూతురు కూడా సినీ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణశేఖర్ కూతురు పేరు నీలిమ. ఈమె ప్రస్తుతం లండన్ లో ఉంది. అక్కడి వెస్ట్ మింస్టర్ యూనివర్సిటీలో విజువల్ కల్చర్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి.. ఇవాళే పట్టా అందుకుంది నీలిమ. విజువల్ కల్చర్ లో మాస్టర్స్ చేసిన ఈమె.. టాలీవుడ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. యాక్ట్రెస్ గా కాకుండా.. తన తండ్రికి సిసలైన వారసురాలిగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

తను దర్శకుడిగా తీసే సినిమాల నిర్మాణం కూడా చేస్తూ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తాడు గుణ శేఖర్. ఈయన కూతురు నీలిమ కూడా టాలీవుడ్ లో దర్శకురాలిగా కానీ.. నిర్మాతగా కానీ సినీ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/