Begin typing your search above and press return to search.

ప్రతాపరుద్రుడు... మెగాస్టార్‌ 150వ సినిమా?

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:28 AM GMT
ప్రతాపరుద్రుడు... మెగాస్టార్‌ 150వ సినిమా?
X
ప్రస్తుతం ఏ నోట విన్నా 'రుద్రమదేవి' సీక్వెల్‌ గురించే. రుద్రమదేవి సెప్టెంబర్‌ 4న రిలీజవుతోంది.

ఇక తరువాయి భాగం తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది అంటూ ఫిలింనగర్‌ లో ప్రచారమవుతోంది. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణీ రుద్రమదేవి వీరత్వాన్ని రుద్రమదేవి 3డిగా తెరకెక్కించిన గుణశేఖరుడు ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రుద్రమదేవుని చరిత్రను కూడా సినిమాగా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెబుతున్నారు.

ఢిల్లీ సుల్తాన్‌ లను ఏడుసార్లు తన్ని తరిమేసిన ప్రతాపరుద్రుని వీరత్వాన్ని తెలుగువారు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అతడి జీవితంలో విరోచిత పోరాటాలు ఎక్కువ. కాబట్టి వెండితెరపైనా వాటిని హైలైట్‌ చేయొచ్చు. ఈ పాత్ర కోసం చరణ్‌, బన్ని, ఎన్టీఆర్‌ వంటి హీరోల పేర్లు గుణశేఖర్‌ పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అయితే రేసులో మెగాస్టార్‌ చిరంజీవి, బాలయ్యబాబు పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు.

వాస్తవానికి ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ తనవద్దకి వస్తే నటించడానికి మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే 150వ సినిమా రేసులో పూరి జగన్నాథ్‌ పేరు వినిపిస్తున్నా.. 'ప్రతాపరుద్రుడు' అన్న కాన్సెప్టు చిరుని ఆలోచింపజేసేదిగా ఉంది. చిరు ఓ వారియర్‌ గా కనిపిస్తే అది తెలుగుతెరపై కొత్తగా కనిపిస్తుంది. అభిమానులకు అది కన్నుల పండువగా ఉంటుంది. పైగా చిరుకి గుణశేఖర్‌ అత్యంత సన్నిహితుడు. చూడాలని ఉంది వంటి హిట్‌ సినిమానిచ్చాడు. కాబట్టి అతడి విషయంలో మెగాస్టార్‌ కి సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది.

ప్రతాపరుద్రునిగా నటిస్తా. నా 150వ సినిమా ఇదేనని చిరు అనేందుకు ఆస్కారం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. వెయిట్‌ అండ్‌ సీ..