Begin typing your search above and press return to search.

గుణ ఐడియా అదిరింది

By:  Tupaki Desk   |   4 Aug 2015 11:21 PM GMT
గుణ ఐడియా అదిరింది
X
తెలుగులో సీక్వెల్ అంటే ఫట్... చరిత్రలో సీక్వెల్ ఆడిన దాఖలాలు లేవు. ఇప్పుడిది పాత కథే. బాహుబలి సీక్వెల్స్ కి కూడా మాంచి జోష్ ఇచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ కి కేకలు పెట్టించే క్రేజ్ ఖాయమని తేలడంతో... సీక్వెల్స్ రెడీ అయిపోతున్నాయి. ఆ క్రెడిట్ వేరే వాళ్లకెందుకు అని జక్కన్న అనుకున్నాడో ఏమో... ఈగ2 చేసేందుకు సిద్ధమయిపోతున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఫిక్స్ అయింది. అదే రుద్రమదేవి. ఈ మూవీకి కొనసాగింపుగా ప్రతాపరుద్రుడిని తీసేందుకు గుణశేఖర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

చాలాకాలం తర్వాత తెలుగులో వస్తున్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్. గుణ ఇంత ధైర్యం చేయడానికి కారణాలు లేకపోలేదు. చరిత్ర ఆధారంగా తెలుగులో తీసిన సినిమా ఏదీ కూడా ఫ్లాప్ కాలేదు. అన్నిటినీ మనోళ్లు ఆదరించారు. అల్లూరి సీతామరాజు, సమ్రాట్ అశోక, తెనాలి రామకృష్ణ... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది.

బాహుబలి లో అనుష్క అందంగా కనిపించలేదు, వీరత్వాన్నీ ప్రదర్శించలేదు. సో... అనుష్క క్రేజ్ సినిమాని సగం హిట్ చేసేస్తుందని నమ్మకంగా ఉంది రుద్రమదేవి టీం. ఎలాగూ ఈ మూవీ కోసం భారీ సెట్టింగ్స్ వేశారు. గ్రాఫికల్ కూడా బాగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడు సీక్వెల్ అంటే.. ఈ ప్రాజెక్టులు, సెట్టింగులను కొంచెం అటూఇటూ చేస్తే సరిపోతుంది. బడ్జెట్ కూడా... రుద్రమదేవి అంత భారీగా పెట్టనక్కర్లేదు. దాంతోపాటే... సీక్వెల్ కూడా తీస్తారంట అని జనాల్లో టాక్ వెళుతుంది. రుద్రమదేవికి ఇధి ప్లస్ అవుతుంది. అధిరిందయ్యా గుణా... మాంచి ఐడియానే.