Begin typing your search above and press return to search.

రాజమౌళికి థ్యాంక్స్ చెప్పిన గుణ

By:  Tupaki Desk   |   5 Oct 2015 11:30 AM GMT
రాజమౌళికి థ్యాంక్స్ చెప్పిన గుణ
X
‘రుద్రమదేవి’ సినిమాకు బాహుబలి ఎప్పుడూ ఓ థ్రెట్ లాగే ఉంది. రెండూ వార్ మూవీసే. స్పెసల్ ఎఫెక్టులే ప్రధాన ఆకర్షణగా తెరకెక్కిన సినిమాలు. ఐతే రాజమౌళి సినిమాకు ముందు నుంచి కావాల్సిన ప్రచారం లభించింది. దాని మీద హైప్ కూడా ఓ రేంజిలో నడిచింది. అలాంటి సినిమా వచ్చిన టైంలోనే ‘రుద్రమదేవి’ని రిలీజ్ చేయడమంటే సాహసమే. బాహుబలి వచ్చాక ‘రుద్రమదేవి’ మీద ఆసక్తి తగ్గిపోతుందన్న భయంతో సాధ్యమైనంత వరకు ‘బాహుబలి’ కంటే ముందే తన సినిమాను విడుదల చేయాలని చూశాడు గుణ. ఐతే అది సాధ్య పడలేదు.

ఇప్పుడు, సరిగ్గా బాహుబలి వచ్చిన మూడు నెలలకు రుద్రమదేవి విడుదలవుతోంది. ఐతే ఈ సినిమాను బాహుబలితో పోల్చి చూస్తారేమో అన్న కంగారు గుణశేఖర్ లో లేకపోలేదు. ఈ కోణంలో చూస్తే బాహుబలి వల్ల ‘రుద్రమదేవి’పై నెగెటివ్ ప్రభావమే ఉంది. ఐతే గుణశేఖర్ మాత్రం బాహుబలి వల్ల తన సినిమాకు కలిగిన లాభాన్నే చూస్తున్నాడు. రాజమౌళికి థ్యాంక్స్ కూడా చెప్పాడు గుణ. ఆ థ్యాంక్స్ ఎందుకో అతడి మాటల్లోనే తెలుసుకోండి.

‘‘రుద్రమదేవి సినిమాకు హిందీలో బిజినెస్ అయిందన్నా.. ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి కలిగిందన్నా అందుకు రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమానే కారణం. అక్కడ మన మార్కెట్ పరిధిని ఎంతగానో విస్తరించింది బాహుబలి. ఆ సినిమా వల్లే రిలయన్స్, అభిషేక్ పిక్చర్స్ వాళ్లు ‘రుద్రమదేవి’ని కొనడానికి ముందుకు వచ్చారు. కథ విన్నాక ఎంత ఆసక్తి కలిగినా.. ఔట్ పుట్ కూడా బావున్నా.. బాహుబలి వల్ల వాళ్లు మరో ఆలోచన లేకుండా నా సినిమాను కొన్నారు’’ అంటూ రాజమౌళికి థ్యాంక్స్ చెప్పకనే చెప్పాడు గుణ.