Begin typing your search above and press return to search.

రాజమౌళికి గుణశేఖర్ జవాబిదీ..

By:  Tupaki Desk   |   13 Oct 2015 9:30 AM GMT
రాజమౌళికి గుణశేఖర్ జవాబిదీ..
X
సామాన్య ప్రేక్షకులే కాదు.. గుణశేఖర్ కూడా ‘బాహుబలి’ ముందు తన ‘రుద్రమదేవి’ ఏమవుతుందో అని భయపడే ఉంటాడు. ఎందుకంటే జక్కన్న ఏకంగా భారతీయ సినిమా శిఖరాల్ని తాకాడు. ‘బాహుబలి’ని ప్రపంచ స్థాయి సినిమాగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ పత్రికలు సైతం ‘బాహుబలి’ గురించి రాసే పరిస్థితి కల్పించాడు. అలాంటి సినిమా తర్వాత యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా వస్తోందంటే.. దాన్ని పోల్చి చూడటం సహజం. ఐతే జక్కన్నకు ఉన్నంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ - వాక్యూమ్ గుణశేఖర్ కు లేదు. కాబట్టి ‘బాహుబలి’ ముందు చాలా విషయాల్లో ‘రుద్రమదేవి’ తేలిపోతుందని అంతా అంచనా వేశారు.

ఆ అంచనాలకు తగ్గట్లే యుద్ద సన్నివేశాల్లో.. గ్రాఫిక్స్-విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో.. ఎమోషన్లు పండించడంలో.. ప్రధాన పాత్రల విషయంలో.. బాహుబలి ముందు రుద్రమదేవి తక్కువగా కనిపించింది. ఐతే ఒక్క విషయంలో మాత్రం రాజమౌళికి దీటైన జవాబిచ్చాడు. అదే గోన గన్నారెడ్డి పాత్ర చిత్రణ. ‘బాహుబలి’లో కట్టప్పది ఎలాంటి పాత్రో.. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కూడా సరిగ్గా అలాంటిదే. లీడ్ క్యారెక్టర్ కు అండగా నిలిచి సైన్యాన్ని నడిపించే పాత్ర. అక్కడ కట్టప్పగా సత్యరాజ్ ఎలా తనదైన ముద్ర వేశాడో.. ఇక్కడ గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అంత కంటే బలమైన మార్కు వేశాడు. ‘బాహుబలి’ సినిమాకు మూలస్తంభాల్లో ఒకటిగా కట్టప్ప పాత్ర నిలిస్తే... ‘రుద్రమదేవి’కి వెన్నెముక అయిపోయింది గోన గన్నారెడ్డి క్యారెక్టర్. దాదాపు సినిమానే నిలబెట్టింది ఈ పాత్ర. మొత్తానికి మిగతా అంశాల సంగతి పక్కనబెడితే.. గుణశేఖర్ రాజమౌళికి దీటుగా నిలిచింది గోన గన్నారెడ్డి పాత్ర విషయంలోనే.