Begin typing your search above and press return to search.

గల్లీ బాయ్ కొల్లగొడుతున్నాడు

By:  Tupaki Desk   |   15 Feb 2019 10:35 AM GMT
గల్లీ బాయ్ కొల్లగొడుతున్నాడు
X
బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ కు శుక్రమహర్దశ ఏదో నడుస్తున్నట్టు ఉంది. ఒకపక్క ఒకదానికి ఒకటి సంబంధం లేని జానర్లు చేస్తూ మరోపక్క ఒకదాన్ని మించి మరొక విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. నిన్న విడుదలైన గల్లీ బాయ్ పాజిటివ్ టాక్ తో అంతటా దూసుకుపోతోంది. ర్యాప్ మ్యూజిక్ ని స్లమ్ ఏరియా నేపధ్యానికి జోడించిన జోయా అక్తర్ దర్శకత్వ ప్రతిభకు సర్వత్రా ప్రశంశలు దక్కుతున్నాయి.

మొదటి రోజు 19 కోట్ల 40 లక్షలు రాబట్టిన గల్లీ బాయ్ రన్వీర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ ప్లేస్ కి కొంచెం దూరంలో ఆగిపోయింది. రెండు నెలల క్రితం విడుదలైన టెంపర్ రీమేక్ సింబా 20 కోట్ల 72 లక్షలతో టాప్ లో ఉండగా దాని తర్వాత స్థానాన్ని బాయ్ అందుకున్నాడు. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే సెకండ్ ప్లేస్ లో పద్మావత్ ని దాటడం. 19 కోట్లతో ఇప్పటిదాకా రెండో ర్యాంక్ లో ఉన్నఆ మూవీ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. వీటి తర్వాత గుండె-రామ్ లీలాలు ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఇది చాలా మంచి ఫిగర్స్ అని చెప్పొచ్చు.

ఇంకే సినిమా పోటీలో లేకపోవడంతో గల్లీ బాయ్ కు రికార్డులు సులవవుతున్నాయి. రన్వీర్ తో పాటు అలియా భట్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ర్యాప్ మ్యూజిక్ ని సహజంగా చూపించిన తీరు ముఖ్యంగా యువతను బాగా ఆకరిస్తున్నాయి. సింబా రేంజ్ మసాలాలు లేకపోవడం లోటే అయినప్పటికీ డిఫరెంట్ లైన్ అప్ తో చేసిన ప్రయత్నం కాబట్టి నిన్న జాతీయ మీడియాలో అధిక శాతం 3 నుంచి 4 రేటింగ్ ఇవ్వడం వసూళ్లపై సానుకూల ప్రభావం చూపిస్తోంది. దగ్గరలో ఇంకే భారీ సినిమా లేదు కాబట్టి గల్లీ బాయ్ సిల్లీగా కాకుండా జాలీగా కలెక్షన్ల వేట కొనసాగించేలా ఉన్నాడు.