పెళ్లివేడుకలో అంతమంది తారలా?

Wed Sep 13 2017 16:15:21 GMT+0530 (IST)

ఇద్దరు మనుషుల మనస్సులు ఒక్కటై జరుపుకునే ఒకే ఒక్క వేడుక వివాహం. దాని ముందు ఎన్ని వేడుకలైనా చాలా చిన్నవనే చెప్పాలి. ఏ మతంలో అయినా పద్ధతులు వేరేగా ఉంటాయేమో గాని ఒక్కటయ్యే బంధంలో ఏ మాత్రం తేడా ఉండదు. అటువంటి అద్భుతమైన వేడుకని ఎవరి స్థాయిలో వారు ఘనంగా జరుపుకుంటారు. అదే తరహాలో ఇప్పుడు టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగ చైతన్య - సమంత ఒక్కటి కాబోతున్నారు.ఏ క్షణాన మనస్సులు కలిసాయో గాని ఈ సినీ తారలు ప్రతి ఒక్కరి చేత అద్భుతమైన జంట అని పేరు తెచ్చుకున్నారు. ఇక ఇంట్లో వారు కూడా పెళ్ళికి సై అనడంతో అంగరంగ వైబవంగా గోవా లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు  అయితే ఈ వేడుకకి టాలీవుడ్ నుంచి 175 మంది గెస్టులు రాబోతున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. అందులో రామ్ చరణ్ దంపతులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే సమంత -ఉపాసన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక నాగ్ కి క్లోజ్ గా ఉన్న ఇతర ఇండస్ట్రీ పెద్దలు హాజరుకానున్నారట. ఇప్పటికే పెళ్లి పనులకు పూర్తీ ఏర్పాట్లు చేసుకున్న ఇరు కుటుంబాల బంధువులకు ఆత్మీయులనకు అక్టోబర్ 5 నుంచి 8 వరకు గోవాలోని ఒక రిసార్ట్ లో ఆతిధ్యం ఇవ్వనున్నారట.

చైతు - సమంత ఇరు సంప్రదాయాలను గౌరవించి అక్టోబర్ 6న హిందూ మరియు 7న క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరిగే రిసిప్షన్ కి ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్క వ్యక్తిని నాగ్ పిలవనున్నారు కాని.. అసలు పెళ్ళికి అంతమందిని పిలిస్తే.. ఎకామడేషన్ ఏర్పాట్లతో చాలా ఇబ్బంది అయిపోదు? ఓ రకంగా చూస్తుంటే.. అంతమంది సెలబ్రిటీలను పిలవడం అనేది కూడా జస్ట్ ఒక రూమర్ అంటారా!!