ఫస్ట్ లుక్: గూఢచారి కొత్తగా ఉన్నాడే

Sat Jan 13 2018 21:32:15 GMT+0530 (IST)

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుంటే సినిమా ఇండస్ట్రీలో అంత ఈజీగా అవకాశాలు అందవు. అవకాశాలే మన దగ్గరికి వచ్చేలా క్తియేట్ చేసుకోవాలి అనేలా నేటితరం నటి నటులు అడుగులు వేస్తున్నారు. ముందుగా వారి సొంత టాలెంట్ ను బయటపెట్టి వారికంటు ఒక గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. అయితే అదే తరహాలో అడివి శేష్ కూడా వచ్చాడు. మొదటి సినిమా కర్మ స్వీయ దర్శకత్వంలో చేసినా నటనతో మెప్పించాడు గాని డైరెక్టర్ గా హిట్ కాలేకపోయాడు.కానీ ఆ తరువాత విలన్ గా సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో ఈ ఎన్నారై కి మంచి గుర్తింపు అందింది. వెంటనే వరుసగా అవకాశాలు అందుకున్నాడు. కొద్దీ కొద్దిగా ఎదుగుతూ కథానాయకుడి వరకు వచ్చాడు. క్షణం సినిమాతో  రైటర్ గా వర్క్ చేసిన శేష్ హీరోగా కూడా కనిపించి మంచి గుర్తింపుని అందుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు అదే క్షణం టీమ్ తో మరోసారి కలిసి గూఢచారి అనే సినిమాని చేస్తున్నాడు. క్షణం సినిమాకి ఈ టీమ్ ప్రమోషన్స్ ని బాగానే చేసింది. ఇక ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం కొంచెం గట్టిగా సిద్ధమవుతోంది.

సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో నెటీజన్స్ ని ఆకట్టుకుంటోంది. అడివి శేష్ లుక్ చాలా డిఫెరెంట్ గా ఉంది. తెలుగులో గూఢచారి సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. మరి మనోడు ఏదైనా మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి. సోబిత దులిపల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు శశికిరన్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు.