ఉయ్యాలవాడ కోసం జేమ్స్ బాండ్ ఫైటర్

Tue Jun 12 2018 14:02:48 GMT+0530 (IST)

ఇప్పుడు రాబోతున్న సినిమాల లిస్టును ఓసారి చూస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో తొలిసారి పోరాడిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథను ''సైరా'' అంటూ చెక్కుతున్న సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఓ పాత కోటలో కొన్ని పోరాట సన్నివేశాలను చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు సైరా యునిట్. అయితే ఈ సినిమా విషయంలో ఎన్నో కొత్త కొత్త డెసిషన్లు తీసుకుంటున్న సురేందర్ రెడ్డి.. ఇప్పుడు బి్రటీష్ వారితో పోరాడి గన్స్ ను తెచ్చేసుకునే ఒక ఫైట్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారట. దానికోసం జేమ్స్ బాండ్ సినిమా 'స్కై ఫాల్'కు యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేసిన గ్రెగ్ పావెల్ ను అందుకు ఎంచుకున్నాడట. గతంలో అనేక హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డిజైన్ చేసిన ఈయన.. ఆల్రెడీ బాలీవుడ్ లో ఓ రెండు మూడు సినిమాలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో మకాం వేసి.. అసలు ఉయ్యాలవాడ తెల్ల దొరలపై ఎలా దండయాత్ర చేశాడు అనేది డిజైన్ చేస్తున్నారట.

ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు హైప్ అనేది చాలా ముఖ్యం. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ వంటి మెగాస్టార్ ఉండటం.. అలాగే ఇండియావైడ్ స్టార్లు ఉండటం.. ఇప్పుడు హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ రావడం.. బాగానే ఉంది. అయితే ఈ ఊపంతా కూడుకుని తెరపై చాలా గొప్పగా సినిమాను ఆవిష్కరిస్తే మాత్రం.. మరోసారి తెలుగు ఇండస్ర్టీ బాహుబలి రేంజ్ సక్సెస్ ను అందించే ఛాన్సుంది.