Begin typing your search above and press return to search.

'కబాలి' మీటింగుతో టాపు లేచిపోద్దట

By:  Tupaki Desk   |   27 July 2016 2:17 PM GMT
కబాలి మీటింగుతో టాపు లేచిపోద్దట
X
ఈ మధ్య కాలంలో రివ్యూలు రేటింగులతో సంబంధం లేకుండా.. సినిమాల కలక్షన్లు అదిరిపోతున్నాయి. సరైనోడు సినిమాయే అందుకు ఎగ్జాంపుల్. ఆ తరువాత అ..ఆ సినిమా కూడా అంతే. అయితే ఆ సినిమాలకు కాస్త కాకపోతే కాస్తయినా ఎబోవ్ యావరేజ్ రివ్యూలు వచ్చాయి.. కాని కబాలి విషయంలో మాత్రం అలా జరగలేదు. అయినాసరే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఒక మీటింగ్ పెట్టేస్తున్నారు.

త్వరలోనే చెన్నయ్ లో సూపర్ స్టార్‌ రజనీ ఒక మీటింగ్ పెడుతున్నారట. మామూలు మీటింగ్ కాదది.. కబాలి సక్సెస్ మీట్. ఒక ప్రక్కన చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు మండే నుండి అసలు ధియేటర్లు ఫుల్లు కాకపోవడంతో భారీ నష్టాలు వచ్చే ఛాన్సుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటే.. ఇలా రజనీకాంత్ మాత్రం తన ప్రొడ్యూసర్ కు డబ్బులొచ్చేశాయని సక్సెస్ మీట్ పెడితే.. దానిని ఏమనాలో మరి. అయితే ఈ మీటింగ్ విషయాన్ని నిర్మాత కలైపులి థాను కన్ఫామ్‌ చేశారు కాని.. ఇంతవరకు రజనీ మీటింగుకు వస్తారా లేదా అనే విషయం చెప్పలేదులే.

అయితే ఇప్పటికే ఈ సినిమాను ఈ రేంజు సక్సెస్ చేసినందుకు వందనాలు అంటూ తమిళంలో లేఖ రాసిన రజనీకాంత్.. ఖచ్చితంగా ఈ సక్సెస్ మీటుకు వస్తాడనే అందరూ అనుకుంటున్నారు. మరి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా సూపర్ హిట్ అని చెబుతారా? చూద్దాం.