Begin typing your search above and press return to search.

అందాలతో విందుతో భోజనాలా? ప్చ్

By:  Tupaki Desk   |   25 July 2016 1:30 PM GMT
అందాలతో విందుతో భోజనాలా? ప్చ్
X
''గోపీచంద్ మాస్ ఇమేజ్ కు అందాల భామలు క్యాథరీన్‌ త్రెసా - హన్సిక తొడవ్వడంతో మాస్ ఆడియన్స్ కు ఈ చిత్రం ఓ విందు భోజనంలా ఉంటుంది'' అంటూ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు తదుపరి హీరో గోపిచంద్ తో సంపత్ నంది డైరక్షన్లో సినిమాను తీసే నిర్మాతలు. అసలు ఈ స్టేట్ మెంట్ ఏంటండీ? ఏదో రికార్డు డ్యాన్సు వేస్తున్నారు.. తరలిరండి అన్నట్లుంది ఈ యవ్వారం. కాదంటారా?

ఇప్పటికే తెలుగు సినిమాల్లో హీరోయన్లను కేవలం గ్లామర్ డాళ్ గా తప్పించి.. అసలు క్యారెక్టర్ అనేది ఏమాత్రం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాహుబలిలో తమన్నా అయినా.. గుండెల్లో గోదారిలో తాప్సీ అయినా.. బ్రూస్ లీ లో రకుల్.. టెంపర్ లో కాజల్.. ఏదో కొన్ని సీన్లలో నాలుగు డైలాగులు తప్పిస్తే.. సినిమాలో పాటల కోసం అందాలు ఆరబోయడం మెయిన్ వర్క్. దానికితోడు అసలే తెలుగు సినిమాల్లో కంటెంట్ తక్కువ మసాలా ఎక్కువ.. స్టోరీ తక్కువ బిల్డప్ ఎక్కువ.. పంచు డైలాగులు ఎక్కువ అసలు భావం అనేదే తక్కువ.. అంటూ రకరకాల విమర్శలు (అబ్బే నిజాలే) వినిపిస్తూనే ఉన్నాయి. పోనివ్ విమర్శలను పక్కనెడితే.. కనీసం అలాంటి విషయాలను 'అందాల భామలతో విందు భోజనం.. మాంచి రోమాంచితంగా చూపించనున్నాడు' అంటూ పబ్లిసిటీ చేయడం ఇంకా విమర్శలకు దారితీసే ఛాన్సుంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన గోపిచంద్ సినిమాల్లో.. హీరోయిన్ల అందాల విందు భోజనాలు బాగానే ఉన్నాయి. కాని సినిమాలే ఢమాల్‌ అన్నాయ్. అంటే అందాల విందులతో పనవ్వదు.. కేవలం కంటెంట్ తో కప్పు కాఫీ ఇస్తే హిట్టొస్తుంది అనే లెక్కను అర్ధం చేసుకోవాలిగా.. మళ్ళీ ఈ విందులెందుకు!!