Begin typing your search above and press return to search.

గౌతమ్ నందలో మహేష్ ని కూడా!!

By:  Tupaki Desk   |   20 July 2017 1:21 PM GMT
గౌతమ్ నందలో మహేష్ ని కూడా!!
X
గౌతమ్ నంద.. మాస్ హీరో గోపీచంద్ నటించిన ఈ లేటెస్ట్ మూవీ వచ్చే వారం విడుదల కానుంది. టైటిల్ తోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసేశాడు గోపీచంద్. అసలు పవన్ కళ్యాణ్ ను గుర్తు చేసేలా ఈ టైటిల్ పెట్టడం వెనక దర్శకుడు సంపత్ నంది హ్యాండ్ ఉందని అనడంలో సందేహం లేదు.

రవితేజతో బెంగాల్ టైగర్ అంటూ పవన్ డైలాగ్ ని వాడిన ఈ దర్శకుడు.. ఆ తర్వాత గౌతమ్ నంద అంటూ అత్తారింటికి దారేది మూవీలో పవన్ కేరక్టర్ పేరు వాడేశాడు. ఇప్పుడు మహేష్ బాబును కూడా ఈ సినిమాలో వాడేస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ నంద చిత్రంలో.. గోపీచంద్ పూర్తి పేరు.. ఘట్టమనేని గౌతమ్ నంద అని తెలుస్తోంది. ఈ ఒక్క ఇంటి పేరు వినగానే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగా పులకరించి పోతారో చెప్పాల్సిన పని లేదు. బిలియనీర్ అని పేరు చెప్పగానే అర్ధమయేందుకే ఇలాంటి పేరు పెట్టాడట దర్శకుడు. ఒకవైపు కేరక్టర్ పేరుతో పవన్ ను వాడేస్తున్న సంపత్ నంది.. ఇంటిపేరుతో మహేష్ ను కూడా పట్టేస్తున్నాడన్న మాట.

ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఘట్టమనేని గౌతమ్.. ఇది మహేష్ కొడుకు పేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క పేరులో ఇంతమందిని గుర్తు చేసేయడం అంటేనే.. సంపత్ నంది తెలివితేటల స్థాయి అర్ధమవుతుంది.