Begin typing your search above and press return to search.

గోపి పంతం ఎవరి మీద?

By:  Tupaki Desk   |   21 March 2018 8:35 AM GMT
గోపి పంతం ఎవరి మీద?
X
పైన చూస్తున్న ఫస్ట్ లుక్ లో కాన్సెప్ట్ ఏమై ఉంటుందా అనే ఎనాలిసిస్ పక్కన పెడితే విజయం సాధించే తీరాలి అనే పంతం మాత్రం గోపీచంద్ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు చక్రవర్తితో చేస్తున్న తన 25వ సినిమా ‘పంతం’ ఫస్ట్ లుక్ ముందు అనుకున్నట్టు కాకుండా ఒక రోజు ముందే విడుదల చేసారు. ట్రిమ్ చేసిన మీసకట్టుతో హెయిర్ స్టైల్ లో మార్పులు చేసి కాస్తంత రఫ్ లుక్ తెచ్చుకున్న గోపి పంతం క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. దేని కోసమో వెతుకుతూ అది దొరకని కసిని కళ్ళలో చూపిస్తూ ఎవరి గురించో ఆలోచిస్తున్న పంతం పోస్టర్ చూస్తుంటే ఇదేదో మైండ్ గేమ్ బేస్ చేసుకున్న థ్రిల్లర్ మూవీలాగా అనిపిస్తోంది. కాన్సెప్ట్ ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్త పడిన టీం గోపి ని చాలా డిఫెరెంట్ రోల్ లో చూపించబోతున్నట్టు చెబుతోంది. మైండ్ గేమ్ మూవీస్ ఎన్ని వచ్చినా బిగిసడలని కథనంతో ప్రేక్షకులను మెప్పిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితం ఉంటుందని గతంలోనే ప్రూవ్ అయ్యింది.

ఒక కారణం కోసం పంతం పట్టాను అంటున్న గోపీచంద్ అది విలన్ ని ఉద్దేశించి అన్నాడా లేక ఇంకేదైనా అనేది ప్రస్తుతానికి చెప్పలేం. మెహ్రీన్ పిర్జాందా హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కీలక భాగం విదేశాల్లో షూటింగ్ చేసారు. గత ఏడాది ఆక్సిజన్, గౌతం నందా తీవ్రంగా నిరాశ పరచగా ఆరడుగుల బులెట్ మార్నింగ్ షో పడబోతోంది అన్న టైం లో విడుదల ఆగిపోయింది. అందుకే చాలా కసితో హిట్ కొట్టాలి అనే లక్ష్యంతో ఉన్న గోపికి పంతం హిట్ కావడం చాలా అవసరం. తనకు బాగా అచ్చి వచ్చిన రెండక్షరాల సెంటిమెంట్ మరోసారి ఫాలో అయినట్టు కనిపిస్తోంది. యజ్ఞం - రణం - లౌక్యం - వర్షం - జయం ఇలా గోపీచంద్ నటించిన సూపర్ హిట్ మూవీస్ అధిక శాతం రెండు అక్షరాలు ఉన్నవే. ఇది కూడా అదే రూట్ లో హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు.

నిన్ను కోరి ఫేం గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ సత్యసాయి బ్యానర్ లో కెకె రాధాకృష్ణ నిర్మాతగా రూపొందుతోంది. టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న పంతం సాలిడ్ హిట్ అయితే మళ్ళి గోపీచంద్ ఫాంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు. మే లో విడుదల ప్లాన్ చేసిన పంతం టీజర్ మరో రెండు వారాల్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది సినిమా యూనిట్.