Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ పక్కన ఆమె కన్ఫమ్

By:  Tupaki Desk   |   28 Nov 2015 9:30 AM GMT
మెగా ప్రిన్స్ పక్కన ఆమె కన్ఫమ్
X
కెరీర్ ఆరంభంలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ లాంటి హిట్లతో దూసుకెళ్లింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఈ మధ్య రకుల్ జర్నీ అంత సాఫీగా సాగట్లేదు. ‘పండగ చేస్కో’ ఏవరేజ్ అనిపించుకుంటే స్టార్ హీరోల సరసన చేసిన కిక్-2 - బ్రూస్ లీ దారుణమైన ఫలితాన్నిచ్చాయి. ఐతే ఈ ఫలిలతాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది రకుల్.

ఇప్పటికే నాన్నకు ప్రేమతో - సరైనోడు లాంటి పెద్ద సినిమాలు చేస్తున్న రకుల్.. తాజాగా ఇంకో మంచి ఛాన్స్ కొట్టేసింది. మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రకులే హీరోయిన్ గా ఫిక్సయింది.రకుల్.. గోపీచంద్ దర్శకత్వంలో ఇప్పటికే ‘పండగ చేస్కో’ చేసింది. ఆ సినిమాలో రకుల్ పెర్ఫామెన్స్ నచ్చడంతో గోపీ ఆమెకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు.

‘పండగ చేస్కో’ తర్వాత మురుగదాస్ కథతో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నించి విఫలమైన గోపీ.. చివరికి వరుణ్ తో సినిమాకు కమిటయ్యాడు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో సాగే లవ్ స్టోరీ ఇదని సమాచారం. వరుణ్ మూడో సినిమా ‘లోఫర్’ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెలలోనే గోపీ-వరుణ్-రకుల్ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్తుంది.