Begin typing your search above and press return to search.

గుడ్ గా పలకరించాడంతే

By:  Tupaki Desk   |   23 Sep 2017 6:28 AM GMT
గుడ్ గా పలకరించాడంతే
X
అమృతం సీరియల్ తో చాలా ఫెమాస్ అయిన నటుడు హర్షవర్ధన్ ఆ తర్వాత నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత గుండెజారీ గల్లంతయ్యిందే - మనం సినిమాలతో మాటల రచయిత గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమృతం సీరియల్ కొన్ని ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించిన హర్ష ఇప్పుడు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఒక కొత్త కాన్సెప్ట్ తో గుడ్–బ్యాడ్ అండ్ అగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

1980 బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ కొత్త తరహా కథలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ ముఖీ మెయిన్ లీడ్ లో నటిస్తుంది. మురళి కృష్ణ మరొక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా దర్శకుడు చిత్రం యొక్క టీజర్ ని రిలీజ్ చేశాడు. శ్రీ ముఖీ సినిమాలో చాలా అందంగా ట్రెడిషినల్ గర్ల్ గా కనిపిస్తోంది. చూస్తుంటే సినిమా లవ్ స్టొరీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లు ఉంది. టీజర్ లో ఎక్కువగా ప్రతి పాత్రలో స్మైల్ ఇవ్వడం స్పెషల్ గా ఉంది. బహుశా దర్శకుడు మొదట నవ్వుతో గుడ్ గా పలకరించాలని అనుకున్నాడేమో. ఇక ఫ్లూట్ మ్యూజిక్ చాలా బావుంది.

గత నెల స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రీ ముఖీ విభిన్న కోణాల్లో కనిపించనుందట. గ్లామర్ గర్ల్ గాను మరియు ట్రెడిషనల్ అమ్మాయిగాను అలాగే గల గల మాట్లాడే గడసరి పిల్లగా కనిపించనుందట. ఇప్పటివరకు అసలు వెండితెరపై హిట్టు కొట్టలేకపోతున్న ఈ యాంకర్.. తొలిసారిగా డైరక్షన్ చేస్తున్న ఆ నటుడు.. చూద్దాం ఏం చేస్తారో!!