Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: గోల గోల ఎగైన్

By:  Tupaki Desk   |   22 Sep 2017 1:12 PM GMT
ట్రైలర్ టాక్: గోల గోల ఎగైన్
X
గోల్ మాల్ సిరీస్ కి బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. గత పదేళ్లుగా ఇప్పటికి మూడు సినిమాలు రిలీజ్ కాగా.. ఇప్పుడీ సిరీస్ లో నాలుగో అంకంగా గోల్ మాల్ ఎగైన్ థియేటర్లలోకి దూసుకొస్తోంది. రోహిత్ శెట్టి డైరెక్షన్ అంటే సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ట్రైలర్ ఒక్కటి సరిపోతుంది.

కామెడీ.. స్టైలింగ్.. తెర నిండా యాక్టర్స్.. కలర్ ఫుల్ ఫ్రేమింగ్.. బోలెడంత హంగామా.. అంతా కలిపితే వెరసి గోలగోల చేసి పారేస్తే ఎలా ఉంటుందో.. అదే గోల్ మాల్ అండ్ రోహిత్ శెట్టి మూవీ. గోల్ మాల్ ఎగైన్ కూడా ఇందుకు విభిన్నం ఏమీ కాదు. అజయ్ దేవగన్.. అర్షద్ వార్సి.. తుషార్ కపూర్.. కునాల్ ఖేము.. నలుగురూ కలిసి నవ్వులు పూయించేశారు. ఈ సారి వీళ్లకు టబు.. శ్రేయాస్ తల్పడే.. పరిణీతి చోప్రాలతో పాటు ప్రకాష్ రాజ్ కూడా తోడయ్యాడు. ఓ ఇంట్లో ఉండే దెయ్యాన్ని ఎలా ఫేస్ చేశారన్నదే కాన్సెప్ట్ అయినా.. అది రోహిత్ శెట్టి చేతిలో పడితే ఎలా ఉంటుందో గోల్ మాల్ ఎగైన్ చూపిస్తుంది.

గోల్ మాల్ ఎగైన్ ట్రైలర్ లో మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది. ముఖ్యంగా బీజీఎం కొత్తగా వింటున్న ఫీలింగ్ కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇందుకు కారణం.. తమన్ ఎస్ఎస్. తొలిసారిగా ఓ బాలీవుడ్ మూవీకి మ్యూజిక్ ఇస్తున్న తమన్.. తన సర్వశక్తులు ఒడ్డేసి మరీ గోల్ మాల్ ఎగైన్ కి మ్యూజిక్ ఇచ్చాడు. బీజీఎంల విషయంలో తనకు ఉన్న పేరును.. మరింతగా పెంచుకున్నాడు థమన్. అక్టోబర్ 20న విడుదల కానున్న గోల్ మాల్ ఎగైన్.. థమన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి.