రాధిక ఆప్టే.. చూడడానికే భయపడతారు..

Fri Aug 17 2018 13:17:59 GMT+0530 (IST)


రాధిక ఆప్టే.. విలక్షమైన పాత్రలు చేస్తూ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. బోల్డ్ సినిమాలైనా.. ఎమోషనల్ మూవీ అయినా సరే తనదైన శైలిలో నటిస్తూ అలరిస్తోంది. తాజాగా రాధిక ఆప్టే వెబ్ సిరీస్ తో మన ముందుకు వస్తోంది.ప్రేక్షకులకు చూపించని సీన్లు - హర్రర్ - సెక్స్ ఓరియెంట్ గల మూవీలు  థియేటర్ లో విడుదల చేయడానికి వీలు లేకుండా పోతోంది. సెన్సార్ ఒప్పుకోదు. అలాగే మూడు గంటల్లో చెప్పాల్సింది చెప్పుకోలేం. అందుకే వెబ్ సిరీస్ ల రూపంలో కాలపరిమితి లేని ఈ వాస్తవ సంఘటనల సినిమాలు నెట్ లో వస్తున్నాయి. అవి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.

తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘గూల్’ వెబ్ సిరీస్ వస్తోంది. హిందీతోపాటు తెలుగు తమిళ్ లోకి దీన్ని అనువదిస్తున్నారు. ఆగస్టు 24న ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో ఈరోజు రిలీజ్ అయ్యింది. ‘ఇన్సిడియస్’ - ‘గెట్ అవుట్’ - ‘ఉడ్తా పంజాబ్’ వంటి సెన్షేషనల్ మూవీస్ తెరకెక్కించిన టీం ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది. నెట్ ఫ్లిక్స్ టీం ఫాంటమ్ ఫిలింస్ - ఇవాన్ హోమ్ - బ్లమ్ హౌస్ సంస్థలు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాయి. పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహిస్తున్నారు.