Begin typing your search above and press return to search.

సాహో టీజర్ వస్తోంది : గెట్ రెడీ

By:  Tupaki Desk   |   10 Jun 2019 11:37 AM GMT
సాహో టీజర్ వస్తోంది : గెట్ రెడీ
X
కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ప్రభాస్ అభిమానులు సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్న సాహో సందడి ఇంకో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా రెండు మూడు పోస్టర్లు మేకింగ్ వీడియోలతో మేనేజ్ చేసిన టీమ్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జైట్ మెంట్ ఇవ్వబోతోంది. జూన్ 13న టీజర్ విడుదల కాబోతోంది. థియేటర్లలో ఆ మరుసటి రోజు జూన్ 14 నుంచి చూసుకోవచ్చు. అంటే ఇంకొక్క 72 గంటల్లోనే కనులవిందైన యాక్షన్ ఫీస్ట్ కళ్ళారా చూసుకోవచ్చన్న మాట.

ఈ అప్ డేట్ ఇస్తూ యువి సంస్థ శ్రద్ధ కపూర్ మాత్రమే ఉన్న కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. డార్లింగ్ లేకపోవడం కొంత నిరాశ పరిచినా టీజర్ ఎంతో దూరంలో లేదు కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటున్నారు ఫాన్స్. రేపు మరియు ఎల్లుండి ఇలాంటి పోస్టర్లు ఇతర పాత్రధారులవి వచ్చే అవకాశం ఉంది

సో ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా వాటికి కూడా చెక్ పెట్టేసినట్టే. ఆగస్ట్ 15న సాహో విడుదలలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఇప్పుడు వదిలిన పోస్టర్ లో కూడా సంగీత దర్శకుడి పేరు లేనప్పటికీ టీజర్ లో పొందుపరిచినట్టుగా తెలిసింది. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందేమో వేచి చూడాలి. జాకీ శ్రోఫ్ - నీల్ నితీష్ - మందిరా బేడి తదితరులు కీలక పాత్రలు పోషించిన సాహో టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ మూవీ గా రికార్డు సృష్టించనుంది