Begin typing your search above and press return to search.

కోన సినిమా కోలీవుడ్లోకి..

By:  Tupaki Desk   |   28 May 2016 7:08 AM GMT
కోన సినిమా కోలీవుడ్లోకి..
X
కోన వెంకట్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘గీతాంజలి’. ఈ చిన్న సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవడమేంటి అంటారా..? దీని కంటే ముందు కోన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్లున్నాయి కానీ.. కోనకంటూ వ్యక్తిగతంగా ఓ ప్రతిష్ఠ తీసుకొచ్చిన సినిమా ఇది. కోన స్క్రీన్ ప్లే.. మాటలు అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ‘గీతాంజలి’ పట్టాలెక్కడానికి.. ఆ సినిమాకు క్రేజ్ రావడానికి.. పెద్ద హిట్టవడానికి ప్రధాన కారణం అతనే. అందుకే ఈ సినిమాను కోన కూడా చాలా స్పెషల్ గా ఫీలవుతాడు. థియేట్రికల్ రన్ తో పాటు శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా కోనకు భారీగా డబ్బులు తెచ్చిపెట్టిన ఈ సినిమా కన్నడలో కూడా రీమేక్ అయి.. అక్కడా మంచి విజయమే సాధించింది.

ఇప్పుడీ సినిమా తమిళంలోకి కూడా వెళ్తోంది. గత ఏడాది ‘ప్రేమకథా చిత్రమ్’ను ‘డార్లింగ్’ పేరుతో రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ మధ్యే ‘నాన్ పేయి పేసురేన్’ అనే హార్రర్ కామెడీకి దర్శకత్వం వహించిన ప్రసాద్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడట. జి.వి.. శ్రీనివాసరెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి అంజలి క్యారెక్టర్ని ఆమే చేస్తుందా.. లేదా వేరే అమ్మాయిని తీసుకుంటారా అన్నది చూడాలి. అంజలికి ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువే. టీనేజర్లాగా ఉండే జి.వి. ముందు ఆమె చాలా పెద్దదానిలా కనిపిస్తుంది. కాబట్టి వేరే హీరోయిన్ని ట్రై చేస్తారేమో.