Begin typing your search above and press return to search.

గీతామాధురి మొగుడు అంటున్నారు

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:48 AM GMT
గీతామాధురి మొగుడు అంటున్నారు
X
నేను పబ్లిక్‌ లోకి వెళితే 'గీతా మాధురి మొగుడు' అనే గుర్తిస్తున్నారు జనం. అలాగని నేను ఈగో ఫీలవ్వను. గీత నాకంటే పాపులర్‌. పెళ్లికి ముందే తను సింగర్‌ గా పాపులర్‌. అదే నాకు కెరీర్‌ పరంగా కలిసొచ్చింది. బోలెడన్ని అవకాశాల్ని తెచ్చిపెట్టింది... అంటూ ఏ ఈగో లేకుండా చెబుతున్నాడు నటుడు నందు. అంతే కాదు ఇంకా కెరీర్‌ పోరాటంలో చాలా గమ్మత్తైన సంగతులే చెప్పాడు.

= నేను నటుడిగా బైటి ప్రపంచానికి తెలియకముందే చరణ్‌ తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించాను. కానీ అది ఎవరికీ తెలియనే తెలీదు. ఇప్పటికీ చరణ్‌ నన్ను గుర్తుపడతారు. మాట్లాడుతారు.

=నావైపు వచ్చిన ఏ అవకాశాన్ని నేను వదిలిపెట్టలేదు. క్యారెక్టర్‌, హీరో, విలన్‌ అన్ని రకాల పాత్రల్ని ఓకే చేశాను. అందుకే కెరీర్‌ పరంగా ఎప్పుడూ బిజీనే. ఇప్పటికిప్పుడు ఓ స్టార్‌ హీరో సినిమాలో విలన్‌ గా నటించేస్తున్నా. ఆ సినిమా ఏంటో ఇప్పటికి రివీల్‌ చేయలేను. ఓ బాలీవుడ్‌ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నా. కబీర్‌ ఖాన్‌తో పనిచేసిన దర్శకుడితో పనిచేస్తున్నా. కన్నడలో మధువన అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నా.

=డబ్బింగ్‌ లోనూ అవకాశాలొస్తున్నాయి. సైజ్‌ జీరోలో ఆర్యకి గొంతు అరువిచ్చాను. గతంలో చాలామంది హీరోలకు నా వాయిస్‌ ఇచ్చాను. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఈగోలకు పోకుండా కెరీర్‌ ని సాగించాలనే ఇలా చేస్తున్నా. ఆ సాయం నాకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది.

=గీతామాధురిని నటించమని చాలాసార్లు చెప్పాను. అయితే అది తనకి ఇష్టం లేదు. నేను బలవంతం చేయలేదు. తనిష్టానికే వదిలేశా. తనతో కలిసి నటించే అవకాశం వస్తే అది బోనస్‌ కిందే లెక్క.

.. అంటూ చాలానే సంగతులు చెప్పాడు.

ఇదంతా సరే .. నందు .. 'గీతామాధురి మొగుడు' అన్న ట్యాగ్‌ లైన్‌ నుంచి 'నందు భార్య గీతామాధురి' అన్న స్థాయికి ఎప్పుడు ఎదుగుతావ్‌? ఎదగాలనే కోరుకుంటున్నాం. ఆల్‌ ది బెస్ట్‌